ఈ రెస్టారెంట్‌లో సర్వర్లు ఉండరు..?

Posted By:

ఈ రెస్టారెంట్‌లో సర్వర్లు ఉండరు..?

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్లామంటే అక్కుడున్న వెయిటర్లు మనకు స్వాగతం పలకటంతో పాటు కోరిన ఆహారాన్ని తెచ్చిపెడతారు. ఇటీవల కాలంలో రోబోట్ రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. తాజా, జపాన్‌లో వెయిటర్ - లెస్ రెస్టారెంట్ వెలిసింది. ఈ రెస్టారెంట్లో అసలు వెయిటర్లే ఉండరు. ఇక్కడ ఏర్పాటు చేసిన కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ఆర్డర్ చేసిన ఆహారాన్నినిమిషాల్లో చేరువచేస్తుంది. ఆయా టెబుళ్ల వద్ద ఏర్పాటు చేసిన టచ్ స్ర్కీన్ మెనూ ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసుకోవల్సి ఉంటుంది. భలే ఆశ్చర్యంగా ఉంది కదండి. వెయిటర్-లెస్ రెస్టారెంట్ లోపల ఏం జరుగుతుందో ఓసారి చూద్దామా..

<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/oT4B_e40pWo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center>

హార్బిన్ పట్టణం (చైనాలోని) రోబో రెస్టారెంట్. ఇక్కడ రోబోలు పనిచేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18. మనం ఇలా రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే.. అక్కడ ఉన్న రోబో ఘన స్వాగతం పలుకుతూ వెల్‌కం చెబుతుంది. సీట్లలో కూర్చున్నవెంటనే మరో రోబో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. కొంతసేపట్లోనే వేరొక రోబో వచ్చి.. మీరు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సర్వ్ చేసి వెళ్లిపోతుంది. అంతే కాదండోయ్.. మీరు తింటున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓ రోబో సింగర్ వచ్చి పాటలు కూడా పాడేస్తుంది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడో రోబో కుక్క కూడా ఉంది. తినడం అయిపోగానే.. కిచెన్‌లో ఉండే రోబో మీ ప్లేట్లను ఎంచక్కా కడిగేస్తుంది కూడా. అంతేకాదు.. మిగతా హోటల్లో ఇచ్చినట్లు ఇక్కడ రోబోలకు టిప్ ఇవ్వనక్కర్లేదు. ఈ రోబో రెస్టారెంట్‌ను ‘భవిష్యత్ రెస్టారెంట్'గా అభివర్ణిస్తున్నారు. ఈ హోటల్ కంప్యూటర్ రూంలో సిబ్బంది ఈ రోబోల కదలికలను నియంత్రిస్తుంటారు. ఈ రోబోలను రెండు గంటలపాటు చార్జ్ చేస్తే.. 5 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఈ ఒక్కో రోబో ఖరీదు రూ.26 లక్షలట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot