అక్కడ సెల్పీ దిగితే మీకు మరణ శిక్ష, ఇందులో నిజమెంత ?

By Gizbot Bureau
|

పర్యాటకులకు థాయ్‌లాండ్‌ అనేది ఓ స్వర్గధామం అని అందరికీ తెలిసిందే. అక్కడ ఉండే బీచ్ ల సౌందర్యాన్ని ఆ్వాదించేందుకు దేశ విదేశాల నుంచి అనేకమంది టూరిస్టులు తరలివస్తుంటారు. సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

 
Tourist may face death penalty for clicking pictures and selfies at Mai Khao Beach in Phuket

అయితే ఈ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థాయ్‌లాండ్‌లోని పుకెట్‌ ఐలాండ్‌ దగ్గర ఉన్న మాయ్‌ ఖావో బీచ్‌కు ఆనుకోని ఫూకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌ వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచ్‌కు అత్యంత సమీపం నుంచి టేకాఫ్‌ అవుతాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇకపై ఇక్కడ సెల్ఫీలు దిగితే మరణదండన విధిస్తామన్నది వార్త సారాంశం. అయితే ఇందులో నిజమెంతో ఓ సారి చూద్దాం.

మానాలకు కూడా ముప్పు

మానాలకు కూడా ముప్పు

టేకాఫ్ అయ్యే సమయంలో సెల్ఫీలు దిగడం పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతానికి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు.

బీచ్‌ను సేఫ్టీ జోన్‌లోకి

బీచ్‌ను సేఫ్టీ జోన్‌లోకి

ఈ మేరకు బీచ్‌ను సేఫ్టీ జోన్‌లోకి చేరుస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పుకార్లే
 

పుకార్లే

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ దీవిలో ఉన్న మైఖావో బీచ్‌లో సెల్ఫీలు దిగడాన్ని నిషేధించారని, అతిక్రమించి సెల్ఫీలు తీసుకుంటే మరణశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ జరగుతున్న ప్రచారం పుకార్లేనని తేలింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని, ఇందులో నిజం లేదని తేలడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

పైలట్లు అసౌకర్యానికి గురవుతున్నారని

పైలట్లు అసౌకర్యానికి గురవుతున్నారని

పర్యాటకుల సెల్ఫీ సరదా కారణంగా పైలట్లు అసౌకర్యానికి గురవుతున్నారని, ఇకపై ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించామని, అతిక్రమిస్తే ఉరిశిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందంటూ ఆంగ్లపత్రికల్లో కథనాలు ప్రచురించారు. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు.

సెల్ఫీలపై ఎటువంటి నిషేధం లేదని

సెల్ఫీలపై ఎటువంటి నిషేధం లేదని

ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధన ప్రభావం పర్యాటకులపై పడుతుందని, క్రమంగా పర్యాటకుల రాక పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్త కాస్తా వైరల్ అవడంతో స్పందించిన ప్రభుత్వం.. అది తప్పుడు వార్త అని, సెల్ఫీలపై ఎటువంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. దీంతో పర్యాటకులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
Tourist may face death penalty for clicking pictures and selfies at Mai Khao Beach in Phuket more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X