ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లపై పోలీసుల నిఘా..

Posted By:

ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లపై పోలీసుల నిఘా..

 

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో కొంత మంది యూజర్స్ ఫేక్ ఎకౌంట్లను క్రియేట్ చేసి వాటిని వేరే విధంగా ఉపయోగిస్తున్నారన్న వార్తలను  చాలానే చూశాం. అలాంటి వాటిని నిరోధించేందుకు గాను అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ పోలీసులు ప్రత్యేకంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వెబ్‌సైట్స్‌లలో ఫేస్ ప్రొపైల్స్‌ని క్రియేట్ చేసి ఇందులో ఎవరైతే సున్నితమైన పదాలను ఉపయోగిస్తున్నారో వారిని ట్రాక్ చేస్తున్నారు.

పోలీస్ డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా యూజర్స్ వారియొక్క పేస్‌బుక్, ట్విట్టర్ ఎకౌంట్స్‌లలో గనుక సెర్చ్ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఆ యూజర్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకొని అతనిపై ఇన్విస్టిగేషన్‌ని ప్రారంభిస్తున్నారు. దీనితో పాటు ఆ యూజర్ ఈ ఎకౌంట్‌ని వేరే ఏదైనా విధివిధానాల కోసం ఉపయోగిస్తున్నాడా.. లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు గాను అతనిపై నిఘాని పెడుతున్నారు.

పోలీసుల పరిశోధనలో తేలిన విషయం ప్రకారం ఇదంతా ఓ ప్రయివేట్ గ్రూప్ పనిగా భావిస్తున్నారు. 2010వ సంవత్సరంలో ఈ ప్రయివేట్ గ్రూప్ బిపి ఆయిల్ స్పిల్‌ ఈవెంట్ సందర్బంలో ముఖ్య పాత్రను పోషించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot