ట్రాఫిక్ ఫైన్స్ : చెక్ చేయడం, ఆన్‌లైన్లో పేమెంట్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రస్తుతం వసూలుచేస్తున్న జరిమానాను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపిన మోటారు వాహన నిబంధనల సవరణ చట్టం సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. మీరు ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అక్కడున్న కెమెరా పసిగట్టేస్తుంది. అదేమి చేస్తుందిలే అనుకునే ోపు మీకు భారీ ఫైన్ వచ్చి పడుతుంది. దీంతో పాటుగా ఆఫ్ లైన్ లో పోలీసులు రూల్స్ అతిక్రమించినందుకు మీకు చలానా విధిస్తారు. అయితే మీరు నేరుగా ఆన్ లైన్ ద్వారా చలానా చెల్లించే సౌకర్యాన్ని RTO కల్పిస్తోంది. అదెలాగో చూద్దాం.

స్టెప్ 1
 

స్టెప్ 1

ముందుగా మీరు E-Challan - Digital Traffic/Transport Enforcement solution website అయిన https://echallan.parivahan.gov.inలోకి మీ మొబైల్ ద్వారా కాని, పీసీ ద్వారా కాని లేక ల్యాపీ ద్వారా కాని వెళ్లాలి. ఇది వన్ నేషన్, వన్ చలానా పేజీ. అందులో కనిపించే Check Challan Statusని క్లిక్ చేయాలి.

స్టెప్ 2

స్టెప్ 2

తర్వాత మీరు మీ వెహికల్ నంబర్ కాని చలానా నంబర్ కాని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు క్యాప్చర్ అనే ఆప్సన్ కనిపిస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఈ మూడు వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు వేసిన చలానా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. చలానా రెండు విధాలుగా రాస్తారు. మీ లైసెన్స్ నంబరు కాని లేకుంటే వెహికల్ నంబర్ కాని ఈ రెండింటిలో దేని మీదనైనా చలానా విధించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఓ సారి చెక్ చేసుకోండి.

స్టెప్ 4
 

స్టెప్ 4

చలానా వివరాలు ఎంటర్ కాగానే అక్కడ మీకు పేమెంట్ చేయడానికి Pay Now ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తరువాత అక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఓటిపి ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ కాగానే మళ్లీ ఈ చలానా పేమెంట్ వెబ్ సైట్లోకి వస్తారు.

స్టెప్ 5

స్టెప్ 5

పై ప్రాసెస్ పూర్తి అయిన తరువాత పేమెంట్ కన్ఫర్మ్ చేయాలా అని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయగానే Proceed with Net Payment అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోగానే మీరు మనీని Net Banking, Card Payments, లేక ఇతర మార్గాల్లో పే చేయమని అడుగుతుంది. ఇది పూర్తి కాగానే మీకు చలానా కట్టినట్లుగా మెసేజ్ వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
traffic fines here's how to check and pay challan online instantly

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X