ఇక సంవత్సరం వ్యాలిడిటీతో ఇంటర్నెట్ ప్యాక్స్

సంవత్సరం వ్యాలిడిటితో కూడిన మొబైల్ ఇంటర్నెట్ ప్యాక్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దేశంలోని అన్ని టెలికం ఆపరేటర్లను కోరింది. మొబైల్ ఆపరేటర్లు ఆఫర్ చేసే డేటా ప్లాన్‌లలో కనీసం ఒక్క ప్లాన్ అయిన సంవత్సరం వ్యాలిడిటీని కలిగి ఉండాలని సూచించింది.

 ఇక సంవత్సరం వ్యాలిడిటీతో ఇంటర్నెట్ ప్యాక్స్

ఏడాది కాలపరిమితితో కూడిన డేటా ప్యాక్ లను అమలు చేసేందుకు ట్రాయ్ 10 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి టెల్కోలు ముందుకు రాలేక పోవటం విశేషం. టెలికామ్ ఆపరేటర్స్ అందిస్తోన్న దీర్ఘకాలిక మొబైల్ డేట ప్యాక్స్ అలానే స్పెషల్ టారిఫ్ ఓచర్ల పై రివ్యూ నిర్వహించిన ట్రాయ్ ఈ అంశాన్ని నోటిస్ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఒకే చెల్లింపు విధానంతో కూడిన సంవత్సరం వ్యాలిడిటీ ఆఫర్లను తీసుకురావాలని ఓ అడ్వైజరీని జారీ చేసింది. ట్రాయ్ తీసుకన్న నిర్ణయం పట్ల ఆపరేటర్ల ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

English summary
TRAI asks telcos to launch internet pack with one year validity. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot