Home
News

ట్రాయ్‌ కొత్త నిబంధనల అమలు గడువు పొడిగింపు.. OTP లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

స్పామ్‌, ఫిషింగ్‌ కాల్స్‌, మెసెజ్‌ లను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI-ట్రాయ్‌) ఎప్పటి నుంచో అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా తీసుకొచ్చిన నిబంధనలు కొత్త చిక్కులను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సహా ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాం ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అయితే టెలికాం సంస్థల విజ్ఞప్తితో ఈ గడువును అక్టోబర్‌ 1 వరకు పొడిగించింది.

ఈ తరహా మెసెజ్‌లు పంపించే వారు టెలికాం ప్రొవైడర్‌ లతో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే URL లు, OTT లింక్‌లు, APK ఫైల్‌లు లేదా కాల్‌ బ్యాక్‌ నంబర్‌లతో కూడిన SMS లను బదిలీ నిలిపేయాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ఆగస్టు 31లోగా తమ మెసేజ్‌ టెంప్లేట్స్‌, కంటెంట్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని ట్రాయ్‌ గతంలో సూచించింది. ప్రస్తుతం ఈ గడువు పొడిగించింది.

TRAI New guidelines may cause OTP delay from september 1st

అయితే ఈ తరహా మెసెజ్‌లు పంపించే ఆర్థిక సంస్థలు హెడర్‌, టెంప్లేట్స్‌ మాత్రమే గతంలో టెలికాం సంస్థ ట్రాయ్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆయా మెసేజ్‌ల్లో కంటెంట్‌ ఏముందనే దానితో సంబంధం లేకుండా మెసేజ్‌లకు అనుమతి ఇచ్చారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీకి టెలికాం సంస్థలు మారాల్సి ఉంటుంది. అంటే ప్రతి సంస్థ కమర్షియల్‌ మెసేజ్‌ చదవాలి. కొత్త నిబంధన ప్రకారం రికార్టులకు అనుగుణంగా లేని మెసెజ్‌లను బ్లాక్‌ చేయనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచే ఈ నిబంధనలను అమలు చేయాలని గడువు విధించింది. అనంతరం ఈ గడువును అక్టోబర్‌ వరకు పొడిగించింది.

ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ సంస్థలు గడువు పొడిగించాలని కోరాయి. దీంతో మరో నెలపాటు గడువిచ్చింది. ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా భారత్‌లో ప్రతిరోజు 1.5 నుంచి 1.7 బిలియన్‌ల బిజినెస్‌ మెసేజ్‌లు పంపబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల దాదాపు 55 బిలియన్‌ల మెసేజ్‌లు పంపుతున్నారు.

ఈ కొత్త నిర్ణయం కారణంగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ సంబంధించిన మెసేజ్‌లు కాల్‌ బ్యాక్‌ నంబర్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ నంబర్‌ను వైట్‌లిస్ట్‌ చేయడంలో సదరు బ్యాంకులు విఫలం అయితే ఆయా మెసేజ్‌లు బ్లాక్‌ చేయబడతాయి. 2021 మార్చిలో తొలిసారిగా ఈ తరహా నిబంధనలు అమలు చేశారు. అప్పట్లో కొన్ని సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
TRAI New Rules may cause bank OTP delay from tomorrow full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X