మొబైల్ యూజర్లకు శుభవార్త, స్పామ్ కాల్స్ వస్తే ఇకపై రూ. 76 లక్షల వరకు జరిమానా

  మీరు తెలియని నంబర్లతో వచ్చే కాల్స్ అలాగే సందేశాలతో విసిగిపోతున్నారా, అయితే ఇలాంటి వాటిపై ట్రాయ్ భారీ చర్యలకు ఉపక్రమించింది. మొబైల్ వినియోగదారులకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గొప్ప ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డు-నాట్-డిస్టర్బ్ జాబితాలో నెంబర్ ఉన్నప్పటికీ ఈ కాల్స్, మెసేజ్‌లు వస్తున్న నేపథ్యంలో ట్రాయ్ నూతన నిబంధనలను ప్రతిపాదించింది. ఈ బ్లాక్‌చైన్ ఆధారిత మార్గదర్శకాల ప్రకారం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన కమ్యూనికేషన్ సంస్థలకు గరిష్ఠంగా నెలకు రూ.76 లక్షల వరకు జరిమానా పడనున్నది.

  మొబైల్ యూజర్లకు శుభవార్త, స్పామ్ కాల్స్ వస్తే రూ.76 లక్షల వరకు జరిమానా

   

  తద్వారా కస్టమర్ల డేటాకూ భద్రత లభిస్తుందని ట్రాయ్ చెబుతున్నది. ఈ తరహా నియంత్రణ వ్యవస్థను ప్రపంచంలోనే తొలిసారిగా అమల్లోకి తెస్తున్నది ట్రాయేనని దాని చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ విలేఖరులకు తెలిపారు. కాగా, ఈ టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ 2018 డ్రాఫ్ట్‌పై జూన్ 11 వరకు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని ట్రాయ్ చెప్పింది.

  ఆకట్టుకునే ఫీచర్లతో Alcatel 3V, బడ్జెట్ ధరకే సొంతం చేసుకోండి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  స్పామ్ కాల్స్‌ విసిగిస్తున్నాయా, Do Not Disturbతో తరిమేయండి

  స్పామ్ కాల్స్ తో సతమతమయ్యే వారు ఈ కింది సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు వాటిని తరిమేయవచ్చు.వివిధ రకాల కంపెనీల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ ని కోడ్ ఎంటర్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయవచ్చు.ఈ సర్వీసు Aircel, Airtel, BSNL, Tata DoCoMo, Idea Cellular, Loop Mobile, MTNL, Reliance Communications, MTS India, Tata Indicom, Uninor, Vodafone, Jio లాంటి అన్ని నెట్‌వర్క్‌లకు పనిచేస్తుంది.

  ట్రిక్ 1

  1. మీరు మీ మొబైల్ నుండి 1909కి కాల్ చేయడం ద్వారా కాని లేక START 0 అని టైప్ చేసి 1909కి మెసేజ్ చేయడం ద్వారా కాని వీటిని బ్లాక్ చేయవచ్చు.
  2. మీరు మీ మొబైల్ నుండి START 1 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Insurance - Financial Products - Credit Cards లాంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
  3. మీరు మీ మొబైల్ నుండి START 2 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Real Estate నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

  ట్రిక్ 2

  4. మీరు మీ మొబైల్ నుండి START 3 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Education నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
  5. మీరు మీ మొబైల్ నుండి START 4 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Health నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

  ట్రిక్ 3

  6. మీరు మీ మొబైల్ నుండి START 5 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Consumer Goods & Automobiles నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
  7. మీరు మీ మొబైల్ నుండి START 6 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Communication - Broadcasting - Entertainment - ITల నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
  8. మీరు మీ మొబైల్ నుండి START 7 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Tourism నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

  వీటిని యాక్టివేట్ చేసుకోవాలంటే..

  మీరు మళ్లీ వీటిని యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు సేమ్ నెంబర్ కి STOPఅని టైప్ చేసి ఎసెమ్మెస్ ద్వారా పంపిస్తే వాళ్లు వాటిని మళ్లీ యాక్టివేట్ చేస్తారు.లేదంటే అదే నంబర్ కి కాల్ చేసి మీరు బ్లాక్ చేసిన వాటిని తిరిగి పొందవచ్చు.

  కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు

  అయితే కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు. bank SMS alerts, bank communications, online bookings, third party personal callingలాంటి వాటిని మీరు బ్లాక్ చేయించుకోలేరు.

  దాదాపు 7 రోజులు సమయం ..

  అయితే ఈ ప్రాసెస్ కి దాదాపు 7 రోజులు సమయం తీసుకుంటుంది. కాగా మీరు సర్వీసు రిక్వెస్ట్ కోసం ఓ సారి అప్లయి చేస్తే మళ్లీ మూడు నెలల తరువాతనే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా ఉచితంగా జరుగుతుంది. దీని కోసం మీనుంచి ఎటువంటి ఛార్జీలు తీసుకోబడవు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Trai for more power to customers on pesky calls, ups fine to Rs 76 lakh for violators More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more