టెల్కోలకు చుక్కలు, కాల్‌కట్ అయితే రూ. 10 లక్షల జరిమానా

Written By:

కస్టమర్లకు తీవ్ర అసౌకర్యం కలిగించే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ స్పందించింది. కాల్‌ డ్రాప్స్‌ను నిరోధించేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యే మొబైల్‌ ఆపరేటర్లకు రూ. పది లక్షల వరకూ జరిమానాను విధిస్తున్నట్టు ట్రాయ్‌ పేర్కొంది.

ఎల్‌జి నుంచి V30, ఆగస్టు 31న ముహర్తం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలుత 5 లక్షల వరకూ జరిమానా

కాల్‌ డ్రాప్స్‌ను నివారించడంలో విఫలమైతే తొలుత 5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని, ఇదే పద్ధతి కొనసాగితే జరిమానాను రూ పదిలక్షలకు పెంచుతామని ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా తెలిపారు.

అక్టోబరు 1 నుంచి అమల్లోకి

ఇవి అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు సేవల్లో నాణ్యతా లోపం వల్ల కాల్‌ అంతరాయాలు ఏర్పడితే, జరిమానా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఉండేది.

ఇకపై టవర్‌ పరిధిలో లెక్కిస్తారు

ఇప్పటివరకు టెలికాం సర్కిల్‌ పరిధిలో కాల్‌ అంతరాయాలను లెక్కిస్తూ వచ్చారు. ఇకపై సర్కిల్‌ పరిధిలోని టవర్ల వారీగా లెక్కించే సామర్థ్యాన్ని ట్రాయ్‌ ఆర్జించింది.

ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం

ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం ఒక టెలికాం సర్కిల్‌లో 90 శాతం మొబైల్‌ టవర్లు, 98 శాతం కాల్స్‌ అందుకోవడంలో 90 శాతం సమయం పాటు విఫలం కాకూడదు. అంటే 2 శాతం కాల్స్‌లో మాత్రమే అంతరాయాలు ఏర్పడవచ్చు.

క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా

ఒకవేళ క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా, కాల్స్‌ రద్దీ విపరీతంగా ఉన్నా, 90 శాతం టవర్ల పరిధిలో 3 శాతానికి మించి కాల్స్‌ అంతరాయాలు ఏర్పడకూడదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Trai gets tough on call drops; slaps penalty of upto Rs 10 lakh Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot