మీరు ప్రీపెయిడ్ మొబైల్ కస్టమరా..? అయితే, ఈ న్యూస్ చదవండి!

Posted By: Prashanth

మీరు ప్రీపెయిడ్ మొబైల్ కస్టమరా..? అయితే, ఈ న్యూస్ చదవండి!

 

న్యూఢిల్లీ: టాక్‌టైమ్‌ను జాగ్రత్తగా వాడుకునేందుకు తక్కువ ధర రీచార్జ్ కూపన్లను కొనుగోలు చేసే ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇక మీదట తక్కువ స్థాయి రీచార్జ్ టాపప్‌లపై ప్రాసెసింగ్ ఫీజు ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) పై 10% లేదా రూ.3లోపునకు పరిమితం కానుంది. వీటిలో ఏది తక్కువైతే అది వర్తించేలా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 20 లేదా అంతకంటే ఎక్కువ టాప్‌అప్‌పై రూ. 3 ప్రాసెసింగ్ ఫీజును విధిస్తున్నారు. రూ. 20 కంటే తక్కువ విలువ గల టాప్‌అప్‌లపై రూ. 2ను వసూలు చేస్తున్నారు. ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ఫీజు మరింత తగ్గనుంది.అంటే రూ. 10 విలువగల టాప్‌అప్‌పై ప్రాసెసింగ్ ఫీజు రూ.1కి పరిమితం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot