శుభవార్త : మొబైల్ కాల్ ధరలు అసలు ఉండవు, భగ్గుమన్న టెల్కోలు !

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్, తగ్గనున్న కాల్ ధరలు, తరువాత అసలు ఉండవట..

By Hazarath
|

మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు ట్రాయ్ (భార‌త‌ టెలికం రంగ నియంత్రణ సంస్థ) శుభ‌వార్త చెప్పింది. ఇంట‌ర్ క‌నెక్ష‌న్ ఛార్జీ (ఐయూసీ) ల‌ను నిమిషానికి 14 పైస‌ల నుంచి 6 పైస‌ల‌కు త‌గ్గిస్తున్నట్లు చెప్పింది. త‌గ్గించిన ఈ ఛార్జీలు వ‌చ్చేనెల 1 నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. ట్రాయ్ నిర్ణయంపై టెల్కోలన్నీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

 

మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండిమీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

జియో చాలా కాలం నుంచి డిమాండ్

జియో చాలా కాలం నుంచి డిమాండ్

ఇంట‌ర్ క‌నెక్ష‌న్ ఛార్జీల‌ను తగ్గించాల‌ని భార‌త టెలికాం రంగ సంస్థ‌ రిలయన్స్ జియో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం తీసుకున్న ట్రాయ్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

జ‌న‌వ‌రి 1, 2020 నుంచి..

జ‌న‌వ‌రి 1, 2020 నుంచి..

జ‌న‌వ‌రి 1, 2020 నుంచి ఈ ఛార్జీల‌ను పూర్తిగా ఎత్తివేస్తామ‌ని తెలిపింది. దీంతో వినియోగదారులకు మొబైల్ కాల్ ధరలు తగ్గనున్నాయి. అయితే ఈ నిర్ణయంపై టెల్కోలు భగ్గుమంటున్నాయి.

ల్యాండ్‌లైన్, మొబైల్‌ నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్‌పై

ల్యాండ్‌లైన్, మొబైల్‌ నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్‌పై

ల్యాండ్‌లైన్, మొబైల్‌ నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్‌పై టర్మినేషన్‌ చార్జీ ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది.

 ఒక నెట్‌ వర్క్‌ నుంచి వచ్చిన కాల్‌కు
 

ఒక నెట్‌ వర్క్‌ నుంచి వచ్చిన కాల్‌కు

టర్మినేషన్‌ చార్జీ అన్నది ఒక నెట్‌ వర్క్‌ నుంచి వచ్చిన కాల్‌కు తన నెట్‌వర్క్‌ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది.

జియో నుంచి Airtel కస్టమర్‌కు కాల్‌ వెళితే...

జియో నుంచి Airtel కస్టమర్‌కు కాల్‌ వెళితే...

ఉదాహరణకు జియో నుంచి Airtel కస్టమర్‌కు కాల్‌ వెళితే... అప్పుడు జియో Airtelకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

జియోకు అనుకూలం

జియోకు అనుకూలం

ట్రాయ్‌ తాజా నిర్ణయం జియోకు అనుకూలంగా ఉండగా... ప్రధాన టెలికం ఆపరేటర్ల డిమాండ్లకు విరుద్ధంగా ఉంది.

కనీసం 30-35 పైసలుగా

కనీసం 30-35 పైసలుగా

ప్రస్తుతమున్న నిమిషానికి 14 పైసల చార్జీతో భారీగా నష్టపోతున్నామని ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30-35 పైసలుగా నిర్ణయించాలని కోరుతున్నాయి.

ఎయిర్‌టెల్‌ గత ఐదేళ్ల కాలంలో

ఎయిర్‌టెల్‌ గత ఐదేళ్ల కాలంలో

ఐయూసీని తక్కువగా నిర్ణయించడం వల్ల గత ఐదేళ్ల కాలంలో రూ.6,800 కోట్ల మేర నష్టపోయినట్టు ఎయిర్‌టెల్‌ ఇటీవలే పేర్కొంది. ఈ చార్జీని తగ్గించమని కోరుతూ వొడాఫోన్‌ గ్రూపు సీఈవో విట్టోరియో కొలావో కేంద్రానికి లేఖ కూడా రాశారు.

యూసీని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్‌..

యూసీని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్‌..

మరోవైపు జియో, ఇతర చిన్న ఆపరేటర్లు మాత్రం ఐయూసీని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇది వినియోగదారులకే లాభమన్నది వీటి వాదన.

 

ఇది దారుణం : సీవోఏఐ

ఇది దారుణం : సీవోఏఐ

ఐయూసీని తగ్గించడం పట్ల సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) సీరియస్‌గా స్పందించింది. టాయ్‌ నిర్ణయం దారుణమని. దీని పరిష్కారం కోసం కోర్టును వెళ్తామని సభ్యులు సంకేతమిచ్చారు.

Best Mobiles in India

English summary
TRAI slashes call connect charge to 6 paise per minute, calls to become cheaper more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X