మరో షాక్ : ట్రాయ్ పరిధిలోకి ఓటీటీ అప్లికేషన్స్‌

|

టీవీ చానెళ్లను కూడా ప్రసారం చేసే హాట్‌‌స్టార్‌ , ఎయిర్‌ టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీ, సోనీ లైవ్‌ వంటి ఓవర్‌ ది టాప్ (ఓటీటీ) అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన పరిధిలోకి తీసుకొచ్చి నియంత్రించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌ ) కోరుకుంటోంది. టీవీ చానెళ్ల మాదిరే వీటికీ లైసెన్సింగ్‌ నిబంధనలను అమలు చేయాలని భావిస్తుంది. టీవీ చానెళ్ల టారిఫ్‌ ను మరింత తగ్గించడానికి ఇటీవలే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి న ఈ సంస్థ, టీవీ చానెళ్లను ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో అందిస్తున్న ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలని అనుకుంటోంది. 2019 ఏడాది ప్రారంభంలో డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ల సర్వీసులపై కొత్త టారిఫ్ నిబంధనలను ట్రాయ్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

మరో షాక్ : ట్రాయ్ పరిధిలోకి ఓటీటీ అప్లికేషన్స్‌

 

ట్రాయ్ మరో షాక్

స్టేక్ హోల్డర్లు, వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త టారిఫ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, ఈ విధానంతో వినియోగదారుల నెలసరి టీవీ బిల్లులు పెరిగిపోయి మరింత భారంగా మారింది. దీంతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఓటీటీ (Over- The-Top) ప్లాట్ ఫాంలపై ఆసక్తి చూపారు. OTT సర్వీసులే బెటర్ అనుకున్న తరుణంలో ట్రాయ్ మరో షాక్ ఇచ్చింది.

క్యారియర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించకుండా

క్యారియర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించకుండా

లైసెన్సు ఫీజు చెల్లించిన వారికి చానెళ్లను ప్రసారం చేసేందుకు అనుమతి ఉంది. ప్రసార హక్కులను టీవీ చానెళ్ల యాజమాన్యాలు కేబుల్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లు లేదా శాటిలైట్ ప్లేయర్లకు అమ్ముకుంటాయి. హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌, సోనీ లైవ్‌‌‌‌‌‌‌‌ వంటి ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఇదే చానెళ్లను క్యారియర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించకుండా ప్రసారం చేయడం అభ్యంతరకరం. యాజమాన్యాలతోపాటు ఓటీటీ ప్రొవైడర్లు లైసెన్సు ఫీజు చెల్లించాలి లేదా ఇద్దరికీ మినహాయింపు ఇవ్వాలని ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారి ఒకరు అన్నారు.

బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్సు

బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్సు

మనదేశంలో టీవీ చానెళ్ల బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్సు పదేళ్లపాటు ఉంటుంది. కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వం విధించిన అన్ని రూల్స్‌‌‌‌‌‌‌‌నూ చానెళ్లు పాటించాలి. ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఐటీ చట్టంలోని నిబంధనలను పాటిస్తే సరిపోతుంది. వీటికి లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానం లేదు.

ట్రాయ్ నిర్ణయంపై OTT ప్లేయర్ల అసంతృప్తి

ఇదిలా ఉంటే ట్రాయ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి ఓటీటీలను తీసుకురావడాన్ని వాటి యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లకు ఛానళ్ల ధరల విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైందో OTT ప్లాట్ ఫాం ప్లేయర్లకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ట్రాయ్ నిర్ణయంపై OTT ప్లేయర్లు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ట్రాయ్ నిబంధనల పేరుతో తమను ఎందుకు నియంత్రించలేదో పలు కారణాలను ఎత్తి చూపుతున్నాయి.

నియంత్రణ అనవసరం
 

నియంత్రణ అనవసరం

మనదేశంలోని అత్యధిక ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ను టీవీ చానెళ్ల యాజమాన్యాలే నిర్వహిస్తున్నాయి. జీ, స్టార్‌‌‌‌‌‌‌‌, సోనీ, టైమ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు సొంత ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఈ విషయమై వీడియో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సీఈఓ కరణ్‌‌‌‌‌‌‌‌ బేడీ మాట్లాడుతూ టీవీ చానెళ్లను ఇది వరకే ట్రాయ్‌‌‌‌‌‌‌‌ నియంత్రిస్తున్నదని, అవే చానెల్స్‌‌‌‌‌‌‌‌ ఓటీటీల్లో ప్రసారమవుతున్నాయి కాబట్టి వీటిపైనా నియంత్రణ అనవసరమని అభిప్రాయపడ్డారు.

స్టార్‌‌‌‌‌‌‌‌ ఇండియా

టెలికం చట్టం ప్రకారం ఓటీటీలను నియంత్రించేందుకు ట్రాయ్‌‌‌‌‌‌‌‌కు అధికారం లేదు. ఓటీటీలు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌లో భాగం. ఇవన్నీ ఐటీ చట్టం పరిధిలోకి వస్తాయి. చానెళ్ల మాదిరే మాకూ కాంపిటిషన్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ వంటి అన్ని చట్టాలు వర్తిస్తాయని స్టార్‌‌‌‌‌‌‌‌ ఇండియా ట్రాయ్‌‌‌‌‌‌‌‌కు సమర్పించిన పత్రంలో పేర్కొంది.

ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సంప్రదింపులు

ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సంప్రదింపులు

డీటీహెచ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తున్నారు. ఒకే సమయంలో ఒకే షోను అటు చానెల్‌‌‌‌‌‌‌‌లో ఇటు ఓటీటీ యాప్‌‌‌‌‌‌‌‌లో చూపెట్టడం సరికాదని అంటున్నారు. ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌తోపాటు వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, స్కైప్‌‌‌‌‌‌‌‌ వంటి వాయిస్‌‌‌‌‌‌‌‌ కాలింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించాలా అనే విషయంలోనూ ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సంప్రదింపులు జరిపింది. సిఫార్సులు ఇంకా రాలేదు.

డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ల నుంచి ట్రాయ్ కు ఒత్తిడి

మరోవైపు.. డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ల నుంచి ట్రాయ్ కు ఒత్తిడి పెరుగుతోంది. బ్రాడ్ క్యాస్టింగ్ కంటెంట్ సర్వీసులన్నింటికీ ఈ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాయ్.. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూడా కొత్త టారిఫ్ నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకూ ట్రాయ్ నిర్ణయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు.. ఇది సాధ్యమేనా? ఎంతవరకూ వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న ఆదరణ

ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న ఆదరణ

హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వంటి వీడియో ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మరింత ఆదరణ ఉంటుంది. ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌ మరింత వృద్ధి నమోదు చేయనుంది. 2022 నాటికి ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ రూ.5,363 కోట్లకు చేరుకొని ప్రపంచవ్యాప్తంగా టాప్‌‌‌‌‌‌‌‌ 10 మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. అసోచామ్‌‌‌‌‌‌‌‌-పీడబ్ల్యూసీ ఉమ్మడిగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
trai may bring otts carrying tv channels under licensing framework

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X