జియో యూజర్లు పండగ చేసుకునే వార్త

Written By:

జియో యూజర్లకు పండగలాంటి న్యూస్ రాబోతోంది. జియోకు టెలికాం రెగ్యులేటరీ గుడ్‌న్యూస్‌ చెప్పబోతుంది. వివాదస్పదమైన 14 పైసల ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలను దశలవారీగా పూర్తిగా రద్దు చేయాలనే ప్రతిపాదనను ట్రాయ్‌ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ నిర్ణయంతో టెలికం గుండెల్లో గుబులు మొదలైంది.

జియోతో చాలా ప్రమాదం, ఎంతలా అంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలుత 50 శాతం

తొలుత 50 శాతం అంటే 7 పైసలు కోత పెట్టనున్నట్టు ట్రాయ్ సంబంధిత వర్గాలు చెప్పాయి. అనంతరం 3 పైసలు, ఆ తర్వాత జీరోకు ఈ ఛార్జీలు తీసుకురావాలని ట్రాయ్‌ నిర్ణయించినట్టు పేర్కొన్నాయి.

టెలికాం సంస్థల ఆదాయం

అయితే ఐయూసీ రద్దు చేసినా లేదా తగ్గించినా టెలికాం సంస్థల ఆదాయం తగ్గిపోతుందని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు పేర్కొంటున్నాయి. వీటిని రద్దు చేయద్దంటూ కోరుతున్నాయి.

జియో మాత్రం

జియో మాత్రం ఐయూసీ ఛార్జీలను రద్దు చేయాలని పట్టుబడుతోంది. ఐయూసీ ద్వారా ఆపరేటర్లు తమకు సమస్యలు సృష్టిస్తున్నారని జియో ఆరోపిస్తోంది.

ఐయూసీ రద్దుతో

ఐయూసీ రద్దుతో జియో తన సేవింగ్స్‌ను పెంచుకుంటుందని, దీంతో మరింత ధరల యుద్దానికి తెరలేపుతుందని ఇతర ఆపరేటర్లు ఆందోళనకు గురవుతున్నాయి.

జియోకు 100 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు

ప్రస్తుతం జియోకు 100 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లున్నారు. ఐయూసీ రద్దు చేస్తే, ఈ కంపెనీ ఏడాదిలో రూ.6720 కోట్ల ఆదాయం పొందుతోంది. ఇదే సమయంలో ఇతర ఆపరేటర్లు రూ.6720 కోట్లను వదులుకోవాల్సి వస్తోంది.

ఐయూసీని 3 పైసలుగా చేస్తే

ఐయూసీని 3 పైసలుగా చేస్తే, ఇంక్యుబెంట్స్‌కు ఏడాదిలో రూ.5,280 కోట్ల నష్టమొస్తుంది. ఒకవేళ 7 పైసలకు తగ్గించినా రూ.3,360 కోట్లను వదులుకోవాల్సిందే.

కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు చెల్లించే మొత్తాన్నే

ఒక టెలికాం నెట్‌వర్క్‌ నుంచి మరో టెలికాం నెట్‌వర్క్‌కు కాల్‌ వెళ్లినపుడు, కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు చెల్లించే మొత్తాన్నే ఐయూసీ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.

నిమిషానికి 14 పైసలు

ప్రస్తుతం ఇది నిమిషానికి 14 పైసలుంది. ఐయూసీల ద్వారా భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియాలకు 14 శాతం, 18 శాతం దేశీయ వైర్‌లెస్‌ ఆదాయం సమకూరుతుంది.

మొబైల్‌ ఫోన్‌ బిల్లులు

ఐయూసీలను రద్దుచేస్తే, మొబైల్‌ ఫోన్‌ బిల్లులు తగ్గనున్నాయి. ఈ నెల చివర్లోనే ఐయూసీ ఛార్జీలపై రెగ్యులేటరీ నుంచి తుది నిర్ణయం రానుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
TRAI may phase out the controversial interconnect usage charge Read More at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot