Home
News

సిమ్‌ కార్డు పోర్టింగ్‌కు TRAI కొత్త రూల్స్‌.. 7 రోజుల వరకు గడువు.. జులై 1 నుంచే అమల్లోకి..!

సిమ్‌ కార్డు స్వాపింగ్ స్కామ్‌లు ఇటీవల కాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి. మొబైల్ నంబర్‌ వినియోగించి ఆర్థిక సహా ఇతర మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI New MNP Rules) కీలక నిబంధనలను రూపొందించింది. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సిమ్‌ స్వాప్‌ లేదా రీప్లేస్‌మెంట్‌ మోసాల ద్వారా సిమ్ కనెక్షన్ పోర్టింగ్‌ను నిరోధించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

సిమ్‌ మార్పిడి లేదా సిమ్‌ స్వాప్‌ తర్వాత మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు గతంలో ఉన్న 10 రోజుల సమయాన్ని 7 రోజులకు తగ్గిస్తున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. ఫోన్ నంబర్ల ద్వారా చేస్తున్న మోసాలకు చెక్‌ పెట్టేందుకు ట్రాయ్‌ ఈ తరహా నిబంధనలను తీసుకొచ్చింది. సిమ్‌ స్పా్ప్‌ లేదా రీప్లెస్‌మెంట్‌ తేదీ నుంచి ఏడు రోజుల గడువు ముగిసేలోపు UPC కోసం అభ్యర్థన వస్తే కేటాయింపును నిలిపివేయనున్నారు.

TRAI New rules to prevent mobile number porting

గతంలో 10 రోజులుగా ఉన్న గడువు 7 రోజులకు తగ్గించడం వల్ల అత్యవసరంగా పోర్ట్‌ చేయాల్సిన వినియోగదారులకు ఉపయోగపడుతుందని ట్రాయ్‌ అభిప్రాయపడింది. ఈ గడువును రెండు నుంచి నాలుగు రోజులుగా ఉంచాలని కొందరు సూచించగా.. ప్రస్తుతానికి ఈ గడువును 7 రోజులుగా అధికారులు నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

స్విమ్‌ స్పాప్‌ అంటే ఇతర మార్గాల్లో నేరగాళ్లు మీ నంబర్‌పైన కొత్త సిమ్‌ కార్డును పొందడం. ఇలా కొత్త సిమ్‌ కార్డులు పొందిన అనంతరం మీ బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

* జూన్‌ 26 నుంచి భారత్‌లో టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023 అమల్లోకి వచ్చింది. ఇందులోనూ సిమ్‌ కార్డుల వినియోగంపై నియంత్రణ విధించారు. ఒక గుర్తింపు కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులు వినియోగించేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే జరిమానా, జైలు శిక్ష విధించనున్నారు.

కొత్త టెలికాం చట్టంలో సిమ్‌ కార్డుల జారీపై కఠిన నిబంధనలున్నాయి. ఒక గుర్తింపు కార్డుపై 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే రూ.50,000 జరిమానా విధించనున్నారు. రెండోసారి కూడా అదే స్థాయిలో ఉంటే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. దీంతోపాటు బయోమెట్రిక్‌ ద్వారానే కొత్త సిమ్‌ కార్డులు జారీచేస్తారు.

దీంతోపాటు నకిలీ సిమ్‌ కార్డులు కొనుగోలు చేసినా, విక్రయించినా, వినియోగించినా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిమ్‌ కార్డు ద్వారా మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించనున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
TRAI New MNP Rules will effect from july 1st 2024 due to sim card swapping scams
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X