27 నుండి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లే: ట్రాయ్

Posted By: Super

27 నుండి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లే: ట్రాయ్

న్యూఢిల్లీ: సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్‌కి ట్రాయ్ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ ఏమిటని అనుకుంటున్నారా..? ఒక్కో సిమ్‌కార్డ్‌కు ఒక్క రోజులో కేవలం 100 ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకొవడం జరిగింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఎట్టి పరిస్దితులలోను ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేది లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 27నుండి అమల్లోకి తీసుకొని రావాలని కూడా సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్‌‌కి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది.

మొబైల్ మార్కెట్లోకి కొత్తగా ఈ రూల్‌‌ని తీసుకొని రావడంతో కస్టమర్స్‌కి అవాంఛిత కమ్యూనికేషన్‌ను నివారించవచ్చునని తెలిపింది. అయితే దివాళి, ఈద్‌వంటి పండుగల రోజుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని వివరించింది. భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తే, అప్పుడు ఆలోచిస్తామని పేర్కొంది. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అనుమతించడం సాధారణ వినియోగదారుని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, ఈ నిబంధనపై పునరాలోచించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రాయ్‌కు ఇటీవలే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot