మొబైల్ యూజర్లకు మంచి శుభవార్తను అందించిన ట్రాయ్

Telecom Regulatory Authority of India (Trai) మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తను అందించింది.

|

Telecom Regulatory Authority of India (Trai) మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తను అందించింది. స్పామ్ కాల్స్, మెసేజ్ లతో విసిగిపోతున్న వారికి ట్రాయ్ నిర్ణయం నిజంగా శుభవార్త లాంటిదేనని చెప్పాలి. వినియోగదారులకు వచ్చే అనవసర కాల్స్‌, స్మామ్ విషయంలో భారత టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) నిబంధనలను కఠినతరం చేసింది. ఇబ్బంది కలిగించే మార్కెటింగ్‌ కాల్స్‌, మెసేజ్‌లకు సంబంధించిన నిబంధనల్లో ఈ మార్పులు చేర్పులు చేసింది. కొత్త నిబంధనల మేరకు టెలీ మార్కెటింగ్‌ మెసేజ్‌లను పొందడానికిగా కస్టమర్ల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు.

ఇండియాకు HTC గుడ్‌బై, షియోమికి షాకిచ్చేలా రీ ఎంట్రీ !ఇండియాకు HTC గుడ్‌బై, షియోమికి షాకిచ్చేలా రీ ఎంట్రీ !

రిజిస్టర్‌ చేసుకున్న సెండర్‌ ద్వారానే..

రిజిస్టర్‌ చేసుకున్న సెండర్‌ ద్వారానే..

ట్రాయ్ మార్పులు చేర్పుల ప్రకారం ఇకపై రిజిస్టర్‌ చేసుకున్న సెండర్‌ ద్వారానే వాణిజ్యపరమైన కమ్యూనికేషన్‌ జరగాలని తెలుస్తోంది. టెలీ మార్కెటింగ్ సందేశాలను వినియోగదారులకు పంపించాలంటే వారి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.

మార్కెటింగ్‌ మెసేజ్‌లు, కాల్స్‌తో ..

మార్కెటింగ్‌ మెసేజ్‌లు, కాల్స్‌తో ..

టెలికాం వినియోగదారులు మార్కెటింగ్‌ మెసేజ్‌లు, కాల్స్‌తో విసుగు చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేసినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) తెలిపింది.

 చికాకును పరిష్కరించడమే..

చికాకును పరిష్కరించడమే..

ఈ నిబంధనల్లో మార్పులు చేయడం తప్పనిసరి. చందాదారులకు ఈ సందేశాల నుంచి ఎదురయ్యే చికాకును పరిష్కరించడమే వీటి లక్ష్యం' అని ట్రాయ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అనుమతిని రద్దు చేసుకోవచ్చు..

అనుమతిని రద్దు చేసుకోవచ్చు..

ఈ సందేశాలను పంపించడానికి చందారుల అనుమతి తప్పనిసరి. అవసరమైనప్పుడు వారు ఈ అనుమతిని రద్దు చేసుకోవచ్చని వెల్లడించింది.

కస్టమర్ ప్రిఫరెన్స్‌ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ

కస్టమర్ ప్రిఫరెన్స్‌ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ

దీనికోసం ప్రతి యాక్సెస్ ప్రొవైడర్ ‘కస్టమర్ ప్రిఫరెన్స్‌ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ' ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మార్పుల ద్వారా వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది.

1,000 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు..

1,000 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు..

నూతన నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పిదాన్ని బట్టి 1,000 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్టు ట్రాయ్‌ హెచ్చరించింది.

Best Mobiles in India

English summary
Trai notifies new rules to check pesky calls and spam messages more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X