TRAI రిపోర్ట్: డౌన్‌లోడ్ స్పీడ్ లో జియో హవా!!! అప్‌లోడ్ వేగంలో ఢమాల్...

|

భారతదేశంలో అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ గా ఎదిగిన రిలయన్స్ జియో యొక్క డౌన్‌లోడ్ స్పీడ్ అక్టోబర్ నెలలో తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా వెల్లడించింది. ట్రాయ్ ఇటీవల తన పోర్టల్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం రిలయన్స్ జియో అక్టోబర్‌ నెలలో కేవలం 17.8Mpbs సగటు డౌన్‌లోడ్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. మునుపటి నెలలో ఈ ఆపరేటర్ యొక్క సగటు డౌన్‌లోడ్ వేగం 19.3 Mbpsగా నమోదు చేసినట్లు ట్రాయ్ డేటా తెలిపింది. ఏదేమైనా రిలయన్స్ జియో అక్టోబర్లో డౌన్‌లోడ్ వేగం చాలా వరకు తగ్గినప్పటికీ ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో అత్యంత వేగవంతమైన వైర్‌లెస్ ఆపరేటర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది.

అక్టోబర్ నెలలో టెలికాం సంస్థల డౌన్‌లోడ్ స్పీడ్ సమాచారం

అక్టోబర్ నెలలో టెలికాం సంస్థల డౌన్‌లోడ్ స్పీడ్ సమాచారం

ట్రాయ్ తన యొక్క మైస్పీడ్ యాప్‌ను ఉపయోగించి డేటా వేగం అనుభవం, సిగ్నల్ బలం మరియు ఇతర నెట్‌వర్క్ సమాచారం వంటి వివరాలను పోర్టల్‌లో విడుదల చేసింది. ట్రాయ్ డేటా ప్రకారం అక్టోబర్లో సగటు 9.1 Mbps డౌన్‌లోడ్ వేగంతో ఐడియా భారతదేశంలో రెండవ అత్యంత వేగవంతమైన ఆపరేటర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. మునుపటి నెలలో ఐడియా సగటు డౌన్‌లోడ్ వేగం 8.6 Mbps గా నమోదు చేసిందని ట్రాయ్ డేటా తెలిపింది.

 

Also Read: Amazon Prime సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లుAlso Read: Amazon Prime సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ - ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ సగటు స్పీడ్ పెరుగుదల

వొడాఫోన్ - ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ సగటు స్పీడ్ పెరుగుదల

వొడాఫోన్ కూడా డౌన్‌లోడ్ వేగంలో మెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబరులో 7.9 Mbps తో పోలిస్తే అక్టోబర్‌లో ఆపరేటర్ సగటున 8.8 Mbps వేగాన్ని నమోదు చేసింది. అయితే భారతీ ఎయిర్‌టెల్ అందరి కంటే దిగువన తన స్థానానికి పడిపోయింది. ఈ ఆపరేటర్ అక్టోబర్‌లో సగటున 7.5Mbps డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. మునుపటి నెలలో కూడా అదే 7.5 Mbps డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది.

 

Also Read: PUBG Mobile ఇండియా గేమ్ కొత్త వెర్షన్‌!!! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా??Also Read: PUBG Mobile ఇండియా గేమ్ కొత్త వెర్షన్‌!!! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా??

అప్‌లోడ్ డేటా వేగంలో వోడాఫోన్ ముందంజ

అప్‌లోడ్ డేటా వేగంలో వోడాఫోన్ ముందంజ

అప్‌లోడ్ వేగం పరంగా అక్టోబర్‌ నెలలో వోడాఫోన్ అత్యంత వేగవంతమైన ఆపరేటర్‌గా తన మొదటి స్థానాన్ని నిలుపుకున్నది అని ట్రాయ్ డేటా తెలిపింది. వోడాఫోన్ అక్టోబర్‌లో సగటున 6.5Mbps అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. గత నెలలో కూడా ఇదే వేగాన్ని నమోదు చేసింది అని ట్రాయ్ తెలిపింది. అక్టోబర్‌లో సగటున 5.9 Mbps వేగంతో ఐడియా ట్రాయ్ చార్టులలో రెండవ స్థానాన్ని నిలుపుకుంది. అయితే, మునుపటి నెలలో ఆపరేటర్ 6.4 Mbps అధిక అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది.

ఎయిర్టెల్ - జియో డేటా అప్‌లోడ్ స్పీడ్ రేంజ్

ఎయిర్టెల్ - జియో డేటా అప్‌లోడ్ స్పీడ్ రేంజ్

భారతి ఎయిర్టెల్ సంస్థ అక్టోబర్ నెలలో సగటున 3.8 Mbps వేగంతో అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఎయిర్టెల్ సంస్థ అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్ రెండింటిలోను మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. మునుపటి నెలలో భారతదేశంలో రెండవ అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ సగటున 3.5 Mbps అప్‌లోడ్‌ను నమోదు చేసినట్లు ట్రాయ్ డేటా తెలిపింది. అయితే రిలయన్స్ జియో అక్టోబర్‌ నెలలో 3.5 Mbps అప్‌లోడ్ వేగంతో అందరి కంటే దిగువ స్థానంలో ఉంది. ఇది మునుపటి నెలలో నమోదు చేసిన అప్‌లోడ్ వేగంతో సమానంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
TRAI October Report: Jio Top on Download Speed and Vodafone Continues to Lead on Upload Speed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X