Home
News

TRAI CNAP జులై 15 నుంచి ఫోన్‌లో సేవ్‌ చేయని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినా వారి పేరు తెలిసిపోతుంది.. ఎలాగో తెలుసా?

మీకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్‌ లేదా మెసేజ్‌ లు వచ్చినప్పుడు వారి వివరాలు తెలుసుకొనేందుకు ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ లను వినియోగిస్తుంటాం. అయితే కొన్ని సార్లు సరైన సమాచారం తెలిసే అవకాశం లేదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI).. గతంలో కేంద్ర ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదన చేసింది. అదే కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP) ఫీచర్‌.. దీని ద్వారా కచ్చితమైన వివరాలు మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు తెలుస్తాయని చెబుతోంది.

ఈ CNAP ఫీచర్ ఎలా పనిచేస్తుంది ..? :
కాలింగ్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ సిస్టమ్‌ను టెలికాం ఆపరేటర్లు అమలు చేయాల్సి ఉంటుంది. అంటే సిమ్‌ కార్డు కొనుగోలు చేస్తున్న సమయంలో సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లోని వివరాలు... కాలింగ్‌ సమయంలో ఇతరులకు కనిపిస్తాయి. కొత్త నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినా.. వారి వివరాలు మీకు తెలియనున్నాయి. అయితే ఈ సర్వీసులు అందించేందుకు టెలికాం ఆపరేటర్లు తొలుత సుముఖత వ్యక్తం చేయలేదు.

Calling name presentation services to start from july 15 to know the unknown caller identity

ప్రభుత్వం మరియు ట్రాయ్‌ ఒత్తిడితో గత నెలలో :
సాంకేతిక సహా ఇతర సమస్యలను టెలికాం సంస్థలు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మరియు ట్రాయ్‌ ఒత్తిడితో గత నెలలో ముంబై, హర్యానాలో కాలింగ్‌ నేమ్ ప్రజంటేషన్‌ సర్వీసులను ట్రయల్స్‌ నిర్వహించాయి. తాజాగా దీనిపై కీలక ముందడుగు పడింది. జులై 15 నుంచి ఈ సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది.

స్పామ్‌ కాల్స్‌ సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం :
ఫలితంగా క్లౌడ్‌ సర్వర్‌ ల ఆధారంగా సేవలు అందించే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల పై ఆధారపడాల్సిన అవసరం తొలగిపోనుంది. జులై 15 నుంచి మీ ఫోన్‌ లో సేవ్‌ చేయని నంబర్ల నుంచి కాల్ వచ్చినా.. వారి పేర్లు మీకు తెలియనున్నాయి. దీని ద్వారా స్పామ్‌ కాల్స్‌ సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది.

ఈ కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ సర్వీసుల (CNAP) ప్రారంభానికి మరో వారం రోజుల సమయం ఉంది. మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్‌ కూడా ఇదే తరహా సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. గూగుల్‌ Lookup పేరుతో తొలుత ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సర్వీసులు అందుబాటుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. అయితే అనంతరం ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Calling name presentation services to start from july 15 to know the unknown caller identity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X