డేటా లేకుండా, తక్కువ ధరలో వాయిస్ కాల్స్ మరియు SMS ప్లాన్లు మళ్ళీ తీసుకురావాలని TRAI ఆలోచన!
భారతప్రభుత్వ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇప్పుడు 'రివ్యూ ఆఫ్ టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (TCPR), 2012' పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వాయిస్ మరియు SMS-మాత్రమే కలిగి ఉండే రీచార్జి ప్లాన్లను గురించి పరిశీలించాలని కోరింది.
2016లో జియో వచ్చినప్పటి నుండి భారతీయ టెలికాం పరిశ్రమలో పెద్ద మార్పులు సంభవించాయి. అంతకు ముంది, వినియోగదారులు డేటా కాకుండా SMS మరియు కేవలం వాయిస్ కాల్స్ ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఈ రోజు కస్టమర్‌ల కోసం అందుబాటులో ఉన్న ప్లాన్‌లు కస్టమర్‌ల కోసం డేటా, వాయిస్ మరియు SMS నుండి అన్నింటినీ కలిపి అందిస్తున్నాయి.

వినియోగదారులకు మరింత కష్టం కలిగించడానికి, టెల్కోలు ఇటీవల ధరలను కూడా పెంచాయి. దీని వల్ల కస్టమర్‌లు వాయిస్-ఓన్లీ వోచర్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో, వినియోగదారులకు వారి మొబైల్ కనెక్షన్ నుండి ఎటువంటి డేటా అవసరం ఉండదు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో డేటా కోసం కూడా చెల్లించక తప్పదు.
TRAI ఆలోచన ప్రకారం, "డేటా మరియు వాయిస్ & SMS సేవలు రెండింటినీ కలిగి ఉన్న బండిల్ ప్లాన్‌ల అవసరం ఉన్నప్పటికీ, చాలా మంది వినియోగదారులు తాము ఉపయోగించని డేటా కోసం తాము చెల్లించడం గమనించవచ్చు." అందుకే ఈ కొత్త ఆలోచనతో వచ్చిందని తెలిపింది.
ట్రాయ్ యొక్క కన్సల్టేషన్ పేపర్‌లో, వాయిస్ & SMS సేవలు మాత్రమే అందించే ప్లాన్‌లను వినియోగదారుల కోసం తిరిగి తీసుకురావాలా వద్దా అని అర్థం చేసుకోవడానికి TRAI నివేదిక రూపొందిస్తోంది. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు కావాలో లేదో తెలుసుకోవడానికి నియంత్రణ సంస్థ సర్వే చేసింది.
ఈ సర్వే ఆధారంగా "వినియోగదారుల సర్వే నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టారిఫ్ ఆఫర్‌లు వాయిస్, డేటా, SMS మరియు OTT సేవలు మొదలైన వాటి మిశ్రమంతో విస్తృతంగా బండిల్ చేయబడిన టారిఫ్ ఆఫర్‌లు అని గమనించబడింది. అందరికీ అన్ని సేవలు అవసరం ఉండకపోవచ్చు మరియు వారికి అవసరం లేని సేవల కోసం వినియోగదారులు ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారనే అభిప్రాయం వినియోగదారులలో ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో వినియోగదారుల అవసరాలను తీర్చే ప్లాన్ల అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు "
TRAI నుండి వచ్చిన ఈ ఆలోచన టెల్కోల నుండి వాయిస్ కాల్స్ మాత్రమే ఉండేలా ప్లాన్‌లను తీసుకురావడం లో సహాయపడవచ్చు.
Jio, Airtel మరియు Vi టెలికాం సంస్థలు ఇటీవలి టారిఫ్ పెంపుతో, చాలా మంది వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు.ఇలాంటి సమయంలో ట్రాయ్ ఇలాంటి ప్రతిపాదన చేయడం గమనించదగిన విషయం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








