మరింత తగ్గనున్న కాల్ రేట్లు

వాయిస్ కాల్స్ ధరలను మరింతగా తగ్గించేందుకుగాను టెలకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టెలికం సర్వీసు ప్రొవైడర్లు ఒకరికొకరు చెల్లించుకుంటున్నఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను 14 పైసల నుంచి 10 పైసలకు తగ్గించే దిశగా ట్రాయ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Read More : ఆగష్టు 21న Android O రిలీజ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రాయ్ నిబంధనలు ప్రకారం..

ట్రాయ్ నిబంధనలు ప్రకారం ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీల విలువ ప్రస్తుతం నిమిషానికి 14 పైసలుగా ఉంది. అంటే మీరు ఎయిర్‌టెల్ నుంచి జియో కాల్ చేయాలంటే ఒక నిమిషానికి గాను ఎయిర్‌టెల్ సంస్థ జియోకు 14 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ కొత్త నిబంధన అమల్లోకి వచ్చినట్లయితే 10 పైసలే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కాల్ రేట్లు కూడా మరింతగా తగ్గే అవకాశముంటుంది.

పోటాపోటీగా ఉచిత ఆఫర్లు..

ప్రస్తతం, టెలికం మార్కెట్లో నెలకున్న వాస్తవ పరిస్థితులను పరిశీలించట్లయితే జియో రాకతో ఒక్కసారిగా ఉచిత ఆఫర్లు జోరు ఊపందుకుంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు కూడా ఉచిత మొబైల్ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాల్స్‌ను ప్రత్యేక ప్యాకేజీ క్రింద అందిస్తున్నాయి.

ఉచిత ఆఫర్ల ట్రెండ్ లాభదాయకంగానే ఉన్నప్పటికి

ప్రస్తుతానికి ఈ ఉచిత ఆఫర్ల ట్రెండ్ లాభదాయకంగానే ఉన్నప్పటికి ఎంత కాలం వరకు కొనసాగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. ఈ నేపథ్యంలో టెలికం రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్, ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను నిమిషానికి 10 పైసల లోపల ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల టెలిక ఆపరేటర్లు ఉచిత ఆఫర్లను ఎత్తివేసినప్పటికి కాల్ ఛార్జీలు మాత్రం అందుబాటు ధరల్లోనే ఉంటాయి.

ఇక టారిఫ్ ప్లాన్‌లను ట్రాయ్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు..

మొబైల్ యూజర్లు త్వరలో తమ నెట్‌వర్క్ ఆపరేటర్ అందిస్తోన్న టారిఫ్ ప్లాన్‌లను ట్రాయ్ వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకునే వీలుంటుందని సంస్థ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ఇలా చేయటం వల్ల టారిఫ్ ప్లాన్‌లకు సంబంధించిన రేట్ల పై మరింత పారదర్శకత ఏర్పడుతుందని ట్రాయ్ భావిస్తోంది.

ఇక పై డిజిటల్ రూపంలోనూ సబ్మిట్ చేయాలి..

ఇప్పటికే దేశంలోని అన్ని టెలికం ఆపరేటర్లు తమ టారిఫ్ ప్లాన్‌లను డాక్యుమెంట్ రూపంలో ఫిజికల్‌గా ట్రాయ్‌కు సబ్మిట్ చేస్తూ వస్తున్నాయి. ఇక పై వీటిని డిజిటల్ రూపంలోనూ సబ్మిట్ చేయవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
TRAI plans to decrease interconnect charges; voice calls to get cheaper. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot