కాల్ ఛార్జీలు 90పైసులు పెరిగుతాయ్!

Posted By: Prashanth

కాల్ ఛార్జీలు 90పైసులు పెరిగుతాయ్!

 

స్పెక్ట్రం ధరలకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రతిపాదించిన సిఫార్సులను ఆమోదిస్తే.. కాల్ చార్జీలు మెట్రోల్లో 90 పైసలు చొప్పున, దేశవ్యాప్తంగా సగటున 29-34 పైసల చొప్పున పెరుగుతాయని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రతిపాదిత స్పెక్ట్రం ధరల సవరణల ప్రభావాలు వినియోగదారులపైనా, పరిశ్రమపైనా ఏ విధంగా ఉంటాయన్న దానిపై కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) ఈ నివేదిక తయారు చేసింది.

దీన్ని జీఎస్‌ఎం ఆపరేటర్ల సమాఖ్య సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) మంగళవారం ఆవిష్కరించింది. వివాదాస్పద ట్రాయ్ సిఫార్సులపై టెలికం కమిషన్ గురువారం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు రిజర్వ్ ధర రూ. 3,622 కోట్లుగా నిర్ణయించాలని ట్రాయ్ తమ ప్రతిపాదనల్లో సిఫార్సు చేయడం తెలిసిందే. ఇది 2008 నాటి 2జీ కేటాయింపుల ధరకు 10 రెట్లు అధికం. ఈ ప్రతిపాదనలతో కాల్ చార్జీలు 4.4 పైసల మేర మాత్రమే పెరుగుతాయని ట్రాయ్ చెబుతుండగా, టెలికం ఆపరేటర్లు మాత్రం 100% పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot