Home
News

ట్రాయ్‌ కీలక సిఫార్సులు.. తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినా.. వారి వివరాలు తెలిసిపోతాయ్..!!

టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI).. కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే మొబైల్‌ ఫోన్ల వినియోగదారుల ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లు అవుతుంది. అయితే ఈ సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

థర్డ్‌ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా.. : ప్రస్తుతం గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు ట్రూకాలర్‌ సహా భారత్‌ కాలర్‌ ఐడీ, యాంటీ స్పామ్‌ వంటి థర్ట్‌ పార్టీ యాప్‌ల ద్వారా వారి వివరాలను తెలుసుకుంటున్నాం. ఇక నుంచి ఇలాంటి యాప్‌ల అవసరం లేకుండా ఎవరు ఫోన్‌ చేసినా వారి వివరాలు డిస్‌ప్లేపైన కనిపించనున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సిఫార్సులను ట్రాయ్‌ కేంద్రానికి సమర్పించింది.

Trai recommends calling name presentation service

ఎవరూ ఫోన్‌ చేసినా వారి వివరాలు తెలిసిపోతాయి : ఎవరు ఫోన్‌ చేసిన వారి పేరు మొబైల్ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ సప్లిమెంటరీ సర్వీసులను (CNAP) అన్ని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లలో సేవ్‌ చేసుకున్న వారి పేర్లు మాత్రమే వారు కాలింగ్‌ చేసినప్పుడు డిస్‌ప్లే పైన కనిపిస్తున్నాయి. థర్ట్‌ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నట్లయితే క్లౌడ్‌ సోర్స్‌ ఆధారిత వివరాలు కనిపిస్తున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ సిఫార్సులు అమల్లోకి వస్తే ఎవరూ ఫోన్‌ చేసినా వారి వివరాలు వెల్లడి అవుతాయి.

Trai recommends calling name presentation service

కొత్త సిమ్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడు కస్టమర్‌ అప్లికేషన్‌ ఫాంలో నమోదు చేసిన వివరాలు మాత్రమే ఫోన్‌ చేసినప్పుడు కనిపిస్తాయి. ఇప్పటికే ట్రూ కాలర్‌, భారత్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి సంస్థలు క్లౌడ్‌ సోర్స్‌ డేటా ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాయి. అంటే మీ నంబర్‌ను ఇతరులు ఎలా సేవ్‌ చేసుకుంటే ఆ పేరునే ఈ సంస్థలు డిస్‌ప్లేపైన కనిపించేలా చేస్తున్నాయి.

ఇలాంటి సర్వీసులను పూర్తిస్థాయిలో విశ్వసించలేమని, అందులే కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ అమలు చేసే విధంగా టెక్నికల్ మోడల్‌ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. టెలికాం సంస్థలు ఈ తరహా సేవల్ని ప్రారంభించే విధంగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2022 సంవత్సరంలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్‌ ప్రతిపాదనలు చేయగా.. తాజాగా తుది సిఫార్సులు చేసింది.

కాలింగ్ నేమ్‌ ప్రజెంటేషన్‌ సర్వీస్‌ అందుబాటులోకి వస్తే.. మహిళలు సహా ఇతరులకు వేధింపులు, బెదిరింపులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఇటువంటి సమస్యల నుంచి బయటపడినట్లు అవుతుంది. అయితే టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Trai recommends to government to implement calling name presentation service
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X