Home
News

ట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగింది

టెలికాం రంగంలో పోటీ అనివార్యమైన నేపథ్యంలో దిగ్గజాలన్నీ పోటీలు పడీ మరీ ఆఫఱ్లు ప్రకటిస్తూ పోతున్నాయి.

By Hazarath Aiah

టెలికాం రంగంలో పోటీ అనివార్యమైన నేపథ్యంలో దిగ్గజాలన్నీ పోటీలు పడీ మరీ ఆఫఱ్లు ప్రకటిస్తూ పోతున్నాయి. అదే సమయంలో ఒకదానితో ఒకటి ఢీ అంటూ కస్టమర్లకు ఇబ్బందులను కలుగజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాల్స్ విషయంలో వినియోగదారులకు నాష్యమైన సేవలు అందండం లేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్ కొన్ని కఠిన చర్యలను అవలంభించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నాణ్యమైన సేవలను అందించని దేశీయ టెలికాం దిగ్గజాలకు భారీ జరిమానాను విధించింది.

నాణ్యమైన సేవలను అందించడంలో..

నాణ్యమైన సేవలను అందించడంలో..

వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో లోపాల కారణంగా భారతి ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌, ఐడియా కంపెనీలకు ట్రాయ్‌ భారీ జరిమానా విధించింది.

నిబంధనల ఉల్లంఘన ..

నిబంధనల ఉల్లంఘన ..

వివిధ సేవల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐ నివేదించింది.

జనవరి-మార్చిలో ..

జనవరి-మార్చిలో ..

2017, అక్టోబరు 1 నుంచి సేవల (QoS) ప్రమాణాలను నిబంధనలను కఠినతరం చేసిన రెగ్యులేటరీ జనవరి-మార్చిలో సేవాల లోపాలకు సంబంధించి ఈ పెనాల్టీ విధించింది.

జియోకు రూ.34 లక్షలు

జియోకు రూ.34 లక్షలు

ముఖ్యంగా టెలికాం మార్కెట్‌ సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియోకు రూ.34 లక్షలు జరిమానా విధించింది.

భారతి ఎయిర్‌టెల్‌..

భారతి ఎయిర్‌టెల్‌..

అలాగే భారతి ఎయిర్‌టెల్‌కు రూ.11 లక్షలు ఐడియా సెల్యులార్‌కు రూ.12.5 లక్షలు, వొడాఫోన్‌ ఇండియాకు రూ.4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

టెల్కోలు ..

టెల్కోలు ..

అయితే తాజా జరిమానాపై టెల్కోలు ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. వారి స్పందన తరువాత తదుపరి నిర్ణయం ఆధారాపడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
TRAI slaps fine on Jio, Airtel, others for not meeting service quality norms in March quarter more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X