4 రూపాయలతో నచ్చిన నెట్‌వర్క్‌లోకి, టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఝలక్ !

By Hazarath
|

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ మరోసారి ఝలకిచ్చింది. మొబైల్‌ నంబరు పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) కోసం ప్రస్తుతం కంపెనీలు వసూలు చేస్తున్న ఛార్జీలను ఒకేసారి 79 శాతం తగ్గించింది. ఇక నుంచి ఎవరైనా అదే నంబర్‌తో ఒక ఆపరేటర్‌ నుంచి మరో ఆపరేటర్‌కు మారాలంటే కంపెనీలకు గరిష్ఠంగా రూ.4 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం కంపెనీలు ఇందుకోసం రూ.19 వసూలు చేస్తున్నాయి. ఏదైనా మొబైల్‌ ఆపరేటర్‌ సేవలు బాగోకపోతే ఖాతాదారులు అదే నంబరుతో వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు ఎంఎన్‌పి ప్రవేశపెట్టారు. ఇటీవల ఎంఎన్‌పిలు గణనీయంగా పెరగడంతో ఈ చార్జీలు కూడా తగ్గిస్తున్నట్టు ట్రాయ్‌ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పోటీ దృష్ట్యా కంపెనీలు ఉచితంగానే ఎంఎన్‌పికి సిద్ధమైనా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడే తేదీ నుంచి కొత్త ఛార్జీ అమల్లోకి వస్తుందని ట్రాయ్‌ ప్రకటించింది.

 

బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !

పాత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..? -

పాత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..? -

మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

- ఈ కోడ్ ఆధారంగా

- ఈ కోడ్ ఆధారంగా

మీరు మారాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేట్‌ర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను సమర్పించాల్సి ఉంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో భాగంగా మీ నుంచి 4 రూపాయిలను వసూలు చేస్తారు. సిమ్ ఛార్జీలు అదనం.

 - వారం రోజుల్లోపు..
 

- వారం రోజుల్లోపు..

- వారం రోజుల్లోపు మీ నెంబర్ కొత్త నెట్‌వర్క్‌లోకి యాక్టివేట్ అవుతుంది. పోర్టబులిటీ చేసుకోబయే నెంబర్ తప్పనిసరిగా 90 రోజులకు మించి వాడకంలో ఉండాలనే నిబంధన ఉంది.

అధికారిక గజెట్‌ నోటిఫికేషన్‌..

అధికారిక గజెట్‌ నోటిఫికేషన్‌..

అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడే తేదీ నుంచి కొత్త ఛార్జీ అమల్లోకి వస్తుందని ట్రాయ్‌ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
TRAI slashes mobile number portability charges to Rs 4 per from Rs 19 More news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X