DTH రూల్స్‌పై ట్రాయ్ కన్ను,కేబుల్ ధరలు తగ్గే అవకాశం

By Gizbot Bureau
|

ప్రజలకు వినోదం భారంగా మారుతోంది. ప్రచార ఛానెళ్లకు ట్రాయ్ విధించిన ధరలతో వినియోగదారులు హడిలిపోతున్నారు. విధించిన ధరలు చెల్లించలేక, వేరే ప్రత్యామ్నాయం లేక, టీవీలను మానుకోలేక అవస్థలు పడుతున్నారు. దీనిని అదునుగా చేసుకుని కేబుల్‌ ఆపరేటర్లు అధిక మొత్తాలను వసూలు చేస్తూ వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు.

TRAI to review DTH rules, may help bring down your cable bill

తాజాగా దీనిపై ట్రాయ్ రివ్యూ స్టార్ట్ చేసింది. కేబుల్ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుండి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ట్రాయ్ DTH రూల్స్‌ మీద కన్నేసింది. ఈ రివ్యూ ప్రధాన ఉద్దేశం వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు వినోదాన్ని అందించడమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు.

30 ప్రశ్నలతో ట్రాయ్ పేపర్ విడుదల

30 ప్రశ్నలతో ట్రాయ్ పేపర్ విడుదల

ఇందులో భాగంగా Telecom Regulatory Authority of India 30 ప్రశ్నలతో కూడిన ఈ పేపర్ ను విడుదల చేసింది. ఈ ప్రశ్నల్లో కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు ఏ మేరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఎలాంటి డిస్కౌంట్లు అందిస్తున్నారు నెల నెల ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఏయే ఛానల్స్ వారికి అందిస్తున్నారు వంటి విషయాలు ఉన్నాయి.

 distribution platform operators (DPOs)

distribution platform operators (DPOs)

ఇప్పడు cable operators and DTH providers ని ట్రాయ్ distribution platform operators (DPOs) గా పరిగణిస్తోంది. డిసెంబర్ 18 తర్వాత ట్రాయ్ ఛానల్ రూల్స్ మార్చి వేయడం కూడా ఇందులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు నెలకు ఎన్ని ఛానల్స్ అందస్తున్నారు ఎంత వసూలు చేస్తున్నారే దానిపై కూడా ట్రాయ్ దృష్టి సారించింది.

 చానళ్లకే చెల్లింపు పద్ధతి

చానళ్లకే చెల్లింపు పద్ధతి

భారతీయ టెలికామ్‌ నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రవేశపెట్టిన నిబంధనలు చూస్తే చానళ్లకే చెల్లింపు పద్ధతి ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రూల్స్ ప్రకారం రూ.150 చెల్లించే ప్రేక్షకులు రూ.250 నుంచి రూ.350 వరకు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి ట్రాయ్ ప్రవేశపెట్టిన పద్ధతిలో పలు ఫ్రీ చానళ్లు వీక్షించేందుకు రూ.130తో పాటు జిఎస్‌టి రూ.18 కలుపుకొని రూ.148 చెల్లించాలి. వీటిలో జెమిని, ఈటివి, మాటివి, జి టీవి, మినహా కొన్ని ఛానళ్లు మాత్రమే వస్తాయి. వాటిలో న్యూస్‌ ఛానళ్లు, కొన్ని ఆదరణ లేని వినోద చానళ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఏమైనా ఛానల్లు అదనంగా కావాలనుకుంటే ఒక ధరను యాజమాన్యాలు ప్రకటించాయి.

ప్రకటనలు ఇవ్వరాదని

ప్రకటనలు ఇవ్వరాదని

ఇంగ్లీషు, హిందీ సినిమాలు, డిస్కవరి ఛానళ్లు చూడాలంటే వీటి కోసం విడివిడిగా డబ్బులు చెల్లించాలి. ఇందులో హెచ్‌డి ఛానళ్ల పేరుతో మరింత దోచేస్తున్నారు. ధర విషయంలో మీ ఇష్టమే ఫైనల్‌ అంటూ కేబుల్‌ ఆపరేటర్లకు అవకాశం ఇవ్వడంతో తమకు తోచినట్టుగా నెలవారీ చెందాను నిర్ణయిస్తూ వారు దోచేస్తున్నారు. తాము డబ్బు చెల్లించి చూస్తున్నప్పుడు ప్రకటనలు ఇవ్వరాదని దీనిని ట్రాయ్ ఎందుకు పరిగణలోకి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

DTH సర్వీసులే కొంచెం బెటర్

DTH సర్వీసులే కొంచెం బెటర్

Sun Direct:

Telugu DPO Pack రూ.179.66 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 211.33 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 191 ఛానెల్స్ చూసే సదుపాయం కల్పిస్తోంది సన్ డైరెక్ట్. Telugu DPO Pack2 కింద రూ. 230.5 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 271.99 చెల్లిస్తే 210 ఛానెల్స్ చూడొచ్చు. కేబుల్ టీవీతో పోలిస్తే ఇందులో ఛానెల్స్ సంఖ్య ఎక్కువ, ఖర్చు తక్కువ.

Dish Tv:

Classic Joy పేరుతో ఉన్న ప్యాక్‌లో 199 ఛానెల్స్‌ను రూ.180 లకే అందిస్తోంది డిష్ టీవీ. దీనికి 18 శాతం GST ఎక్స్‌ట్రా. అలాగే Classic Joy+ Telugu ప్యాక్ కింద 216 ఛానెల్స్ చూసేందుకు రూ. 243+ 18 శాతం ట్యాక్స్ కలిపి రూ.286.74 చెల్లించాల్సి ఉంటుంది.

TATA SKy:

మిగిలిన వాటితో పోలిస్తే టాటాస్కై భిన్నమైన ప్యాక్స్‌ అందిస్తోంది. ఇందులో ఫ్రీ ఛానెల్స్ కాకుండా 20 తెలుగు ఛానెల్స్‌ కోసం రూ.136 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
TRAI to review DTH rules, may help bring down your cable bill

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X