Home
News

గుడ్ న్యూస్: ఇకపై తక్కువ ధరకే కాలింగ్, SMS ప్లాన్స్.. ట్రాయ్ సంచలన నిర్ణయం!

By Ram Kumar

టెలికాం వినియోగదారులకు ముఖ్య గమనిక. ఇకపై మీ మొబైల్ రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకునే అవకాశం మీ చేతుల్లోకి రానుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మీ మొబైల్ రీఛార్జ్‌లకు సంబంధించిన కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులతో ఇకపై మీరు వాడే సర్వీసులకే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.

డేటా అవసరం లేని వాళ్లకు కూడా డేటా ప్లాన్లు కొనాల్సిన అవసరం ఉండదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

TRAI Urges Airtel  BSNL  Jio  Vi to Offer Affordable Voice  SMS Plans

ఇప్పటివరకు చాలా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్, SMSలతో పాటు డేటాను కలిపి ప్లాన్లను అందించేవి. దీంతో పాత మోడల్ ఫోన్లు (2G ఫీచర్ ఫోన్లు) వాడేవాళ్లు, కేవలం మాట్లాడటానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే మొబైల్ వాడుకునేవాళ్లు కూడా డేటా కోసం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చేది.

ఈ సమస్యను గుర్తించిన ట్రాయ్ (TRAI) ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ ఐడియా లాంటి పెద్ద టెలికాం కంపెనీలను ప్రత్యేకంగా వాయిస్ కాల్స్, SMSల కోసం మాత్రమే ఉండే రీఛార్జ్ ప్లాన్లను (స్పెషల్ టారిఫ్ వోచర్లు - STVs) తీసుకురావాలని ఆదేశించింది.

* బలవంతంగా రుద్దకూడదు: ట్రాయ్ ఛైర్మన్

ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి మాట్లాడుతూ, డేటా వాడకాన్ని ప్రోత్సహించడం ముఖ్యమే కానీ, అది వినియోగదారులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు టెలికాం పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ట్రాయ్ ముఖ్య ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు.

టెలికాం కంపెనీలు డేటా ప్లాన్లను అందించవచ్చు, కానీ వినియోగదారులు తాము వాడే సర్వీసులకు మాత్రమే డబ్బులు చెల్లించే అవకాశం కూడా ఇవ్వాలని ఆయన తేల్చి చెప్పారు.

కొత్త రూల్స్ ప్రకారం, టెలికాం కంపెనీలు తప్పనిసరిగా వాయిస్ కాల్స్, SMSల కోసం స్పెషల్ టారిఫ్ వోచర్లను (STVs) అందుబాటులోకి తీసుకురావాలి. ఈ కొత్త ప్లాన్లలో డేటా ఉండదు. కేవలం వాయిస్, టెక్స్ట్ సర్వీసులపైనే దృష్టి పెడతారు.

అంతేకాదు, ఈ వోచర్ల వ్యాలిడిటీని కూడా 90 రోజుల నుంచి ఏకంగా 365 రోజులకు పెంచారు. అంటే, వినియోగదారులకు ఇకపై ఎక్కువ కాలం పాటు వాడుకునే వీలుంటుంది. తరచూ రీఛార్జ్ చేసుకునే బాధ తప్పుతుంది.

* ఆ పాలసీ ఎత్తేశారు

రీఛార్జ్ కూపన్లకు సంబంధించిన రూల్స్‌లో కూడా ట్రాయ్ కొన్ని మార్పులు చేసింది. కలర్ కోడింగ్ విధానాన్ని తీసేశారు. అలాగే, అన్ని రీఛార్జ్ వోచర్లు కనీసం 10 రూపాయల నుంచి మొదలుకావాలనే నిబంధనను కూడా సడలించారు. అయితే, 2012లో ఇచ్చిన టెలికాం ఆదేశాల ప్రకారం 10 రూపాయల వోచర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

ఈ మార్పుల వల్ల లక్షలాది మంది మొబైల్ వినియోగదారులకు తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా డేటా అవసరం లేనివారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

* మరో ముఖ్యమైన విషయం..

ట్రాయ్ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించబోతోంది. ఈ నెలలోనే మొదలయ్యే ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన అనుమతులు, వినియోగదారుల అంగీకారాలను పేపర్ మీద కాకుండా డిజిటల్ రూపంలోకి మారుస్తారు.

దీంతో టెలికాం కంపెనీలు ఈ అనుమతులను మరింత బాగా నిర్వహించగలుగుతాయి. వినియోగదారులకు అలాంటి మెసేజ్‌లు కావాలా వద్దా అని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది.

ట్రాయ్ తీసుకువచ్చిన ఈ మార్పులు చాలా మంది మొబైల్ యూజర్లకు ఊరటనిస్తాయి. కేవలం వాయిస్, SMS సేవలు మాత్రమే కావాలనుకునేవారు ఇకపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. డేటా ప్లాన్ల భారం లేకుండా, తక్కువ ధరకే తమ అవసరాలు తీర్చుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
TRAI has directed telecom companies to offer separate Special Tariff Vouchers for voice and SMS, extending voucher validity to 365 days and relaxing recharge rules, aiming to reduce costs for non-data users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X