Home
News

Airtel, Jio లను ఒకేసారి ఓడించిన వోడాఫోన్‌ ఐడియా!!! ఎందులోనో తెలుసా...

ఇండియా యొక్క టెలికాం రంగంలో ప్రతి నెల ఎదో ఒక మార్పులను పొందుతూనే ఉన్నాయి. టెలికాం రంగంలో నాలుగు ప్రధాన ప్రైవేట్ ఆపరేటర్లు అధికంగా యూసర్ బేస్ ను కలిగి ఉన్నాయి. నవంబర్ నెలలో 2G, 3G మరియు 4G తో సహా అన్ని నెట్‌వర్క్ లతో కలుపుకొని అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్‌ను వోడాఫోన్ ఐడియా పొందినట్లు ట్రాయ్ గణాంకాలను విడుదల చేసింది. సర్వీసు ప్రొవైడర్లలో వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే వోడాఫోన్‌ ఐడియా అగ్రస్థానంలో నిలిచినట్లు డేటా వివరాలు చూపుతున్నాయి. Vi రీబ్రాండ్ గా రూపాంతరం చెందిన వోడాఫోన్ ఐడియా గత నెలలో ఎయిర్‌టెల్, BSNL మరియు రిలయన్స్ జియోలను సమిష్టిగా అధిగమించింది.

ట్రాయ్ తాజా కాల్ క్వాలిటీ యూజర్ డేటా

ట్రాయ్ తాజా కాల్ క్వాలిటీ యూజర్ డేటా

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు  కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్‌ యొక్క తాజా డేటాను ట్రాయ్ ఇటీవల విడుదల చేసింది. వోడాఫోన్ మరియు ఐడియా సమిష్టిగా నవంబర్ నెలలో కాల్ నాణ్యత పరంగా ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ మరియు రిలయన్స్ జియోలను  అధిగమించాయని చూపిస్తుంది. ట్రాయ్ రేటింగ్ ను 5తో విడుదల చేసింది. ఇందులో భాగంగా 4.9 రేటింగ్‌తో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. ఆలాగే వొడాఫోన్ 4.6 రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ 4.1రేటింగ్‌తో తరువాతి స్థానంలో ఉండగా ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ కూడా 3.8 రేటింగ్‌తో వెనుకబడి ఉన్నాయి.

టెలికాం ఆపరేటర్ల నవంబర్ నెల వాయిస్ నాణ్యత రేటింగ్‌

టెలికాం ఆపరేటర్ల నవంబర్ నెల వాయిస్ నాణ్యత రేటింగ్‌

ఇండియాలో నవంబర్ నెలలో మొత్తంమీద 88.4 శాతం మంది వినియోగదారులు సంతృప్తికరమైన వాయిస్ నాణ్యతను, 8.24 శాతం పూర్  వాయిస్ నాణ్యతను మరియు 3.62 శాతం పూర్ కాల్స్ డ్రాప్‌ల రేషియో నమోదు అయ్యాయి. ఇన్ కమింగ్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6 రేటింగ్‌ను సాధించింది అలాగే అవుట్ గోయింగ్ కాల్ నాణ్యతలో 4.3 రేటింగ్‌ను పొందింది. మరోవైపు ఐడియా సంస్థ ఇన్ కమింగ్ కాల్స్ కోసం 4.9 రేటింగ్‌ను మరియు అవుట్ గోయింగ్ కాల్ నాణ్యతలో 4.8 రేటింగ్‌ను సాధించింది. ఎయిర్‌టెల్‌ టెలికాం సంస్థ వరుసగా 3.9, 3.5 రేటింగ్‌ను కలిగి ఉండగా బిఎస్‌ఎన్‌ఎల్ వరుసగా 3.9 మరియు 4.3 రేటింగ్‌ను చివరిగా రిలయన్స్ జియో 3.9, 3.6 రేటింగ్‌ను పొందాయి.

వోడాఫోన్ ఐడియా వాయిస్ కాల్ మెరుగైన నాణ్యత

వోడాఫోన్ ఐడియా వాయిస్ కాల్ మెరుగైన నాణ్యత

ఇండియాలో అక్టోబర్ నెలలో 63.86 శాతం మంది వినియోగదారులు సంతృప్తికరమైన వాయిస్ నాణ్యతను అనుభవించారు. ఇందులో 25.28 శాతం మంది వాయిస్ నాణ్యతను తక్కువగా నివేదించారు మరియు 10.85 శాతం వినియోగదారులు కాల్ డ్రాప్స్ గురించి ఎక్కువగా ఫిర్యాదు చేశారు.  బిఎస్ఎన్ఎల్ 3.7 రేటింగ్‌తో 3.7 రేటింగ్‌తో అందరి కంటే ముందు వరుసలో నిలించింది. తరువాత స్థానంలో ఎయిర్‌టెల్ 3.5 రేటింగ్‌ను, ఐడియా 3.3 రేటింగ్‌తో, జియో 3.2 రేటింగ్‌తో ఉండగా వొడాఫోన్ 3.1 రేటింగ్‌తో చివరి స్థానంలో నిలిచింది.  అక్టోబర్‌లో ఇండోర్ మరియు అవుట్డోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్‌ వరుసగా 3.2 మరియు 2.6 రేటింగ్‌ను కలిగి ఉండగా  ఐడియా 3.4 మరియు 3.1 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా నవంబర్లో గణనీయంగా మెరుగైన నాణ్యతను పొందినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
TRAI: VI Received Highest Call Quality Rating in November Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X