Home
News

మీ ఫోన్ ఎంత సేపు రింగయింది, ఫోకస్ పెడుతున్న ట్రాయ్

By Gizbot Bureau

మీకు ఎవరైనా కాల్ చేశారా..లేక మీరెవరకికైనా కాల్ చేశారా.. కాల్ డిస్ కనెక్ట్ అయ్యే సమయానికి ఫోన్ ఎంత సేపు రింగయింది. ఈ వివరాలు ఎందుకు అనుకుంటున్నారా.. మాకవసరం లేదు. ఇప్పుడు ఈ వివరాలపై Telecom Regulatory Authority of India (Trai)గట్టి ఫోకస్ పెడుతోంది. ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో మ్యాగ్జిమమ్ రింగింగ్ టైమ్ ఎంత సేపు ఉంటుంది. ఎంత వరకు పర్మిషన్ ఉంది అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో టెలికాం కంపెనీల అభిప్రాయాలను ట్రాయ్ కోరింది. ఈ మేరకు ఫోన్ నెట్ వర్క్ కంపెనీలను , స్పెక్ట్రంలను టెలికం రెగ్యులేటరీ అధారిటి ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) సలహాలు, సూచనలు అడిగినట్లుగా తెలుస్తోంది.

మ్యాగ్జిమమ్ నంబర్

మ్యాగ్జిమమ్ నంబర్

సాధారణంగా కాల్ చేసే సమయంలో అవతలి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా ఎక్కువ సేపు రింగింగ్ ఇస్తూ ఉంటారు. ఇది ఫోన్ యూజర్లకు కొంచెం ఇబ్బందిగా మారింది. అందువల్ల మ్యాగ్జిమమ్ టైమ్ ఎంతనే దాని మీద ట్రాయ్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు వ్యూస్ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. "సేవా అనుభవం మరియు నెట్‌వర్క్ పనితీరుపై రింగ్ వ్యవధి యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన విలువలను కనుగొనడం చాలా ముఖ్యం" అని కన్సల్టేషన్ పేపర్ లో ట్రాయ్ తెలిపింది.

Duration Alert for Called Party

Duration Alert for Called Party

ఈ మేరకు ట్రాయ్ ఓ డిస్కసన్ పేపర్ ను టెలికం కంపెనీలకు పంపింది. దీనిలో Duration Alert for Called Party వివరాలు తెలపాలని కోరింది. కాగా మ్యాగ్జిమమ్ టైం అనేది టెలికం కంపెనీలకు చాలా ముఖ్యమైనది. యూజర్లు ఎంత ఎక్కువ సేపు రింగ్ చేస్తే టెలికం కంపెనీలకు అంత ప్రయోజనం ఉంటుంది. దీనిపై ట్రాయ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని కోసం ఎదురుచూస్తున్నామని టెలికం వర్గాలు చెబుతున్నాయి.

కన్సల్టేషన్ పేపర్ యొక్క లక్ష్యం 

కన్సల్టేషన్ పేపర్ యొక్క లక్ష్యం 

ట్రాయ్ విడుదల చేసిన ఈ కన్సల్టేషన్ పేపర్ యొక్క లక్ష్యం రింగింగ్ వ్యవధికి గల విలువను తెలుుకోవడమే. ఇది అన్ని టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లచే కాన్ఫిగర్ చేయబడాలి, ఇచ్చిన కాలానికి మించి జవాబు పరిస్థితి కొనసాగకపోతే ఆపేయాలని అంతే తప్ప టెలికం కంపెనీలు కాల్ బలవంతం చేయకూడదని ట్రాయ్ విడుదల చేసిన consultation paperలో తెలిపింది. కాల్ ఆన్సర్ చేసేందుకు మ్యాగ్జిమమ్ టైంకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం టెలికం కంపెనీలకు లేదని ఇందులో కోరింది.

కొన్ని సమస్యలు రావచ్చు

కొన్ని సమస్యలు రావచ్చు

కాల్ చేయడానికి మరియు నెట్‌వర్క్ వనరులను సముచితంగా ఉపయోగించుకోవటానికి కాలర్‌కు తగిన సమయాన్ని ఇస్తూ జరిమానా సమతుల్యతను పాటించాలి. "తక్కువ రింగింగ్ సమయం అనేది నెట్‌వర్క్ వనరులను కూ ఆదా చేస్తుంది, అయితే ఇది కాల్‌కు సమాధానం ఇవ్వడానికి తీసుకునే సాధారణ సమయం కంటే వ్యవధి చాలా తక్కువగా ఉంటే నెట్‌వర్క్ పనితీరు మరియు కస్టమర్ అనుభవానికి సంబంధించి కొన్ని సమస్యలు రావచ్చు అని ట్రాయ్ కన్సల్టేషన్ పేపర్ లో తెలిపింది. 

సాధారణ రింగ్ సమయం

సాధారణ రింగ్ సమయం

సాధారణంగా మొబైల్ నెట్‌వర్క్‌లలో సాధారణ రింగ్ సమయం 30-45 సెకన్ల మధ్య ఉంటుంది, ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్‌ల కోసం ఇది 60 మరియు 120 సెకన్ల మధ్య ఉంటుంది. ట్రాయ్ తీసుకొస్తున్న ఈ వ్యూ పాయింట్ ద్వారా పాయింట్ ఆఫ్ ఇంటర్‌కనెక్షన్ (పోఐ) పై అవుట్‌గోయింగ్ మరియు ఇన్‌కమింగ్ మినిట్స్ ఆఫ్ యూసేజ్ (ఎంఓయు) యొక్కస్టేటస్ తెలుసుకోనేందుకు ఉపయోగపడవచ్చు. స్టేట్ హోల్డర్స్ వ్యాఖ్యలకు చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించింది, కౌంటర్ వ్యాఖ్యలు ఏదైనా ఉంటే అక్టోబర్ 7 లోపు చెప్పుకోవాలని కూడా ఇందులో తెలిపింది. 

Best Mobiles in India

English summary
TRAI wants to know how long your phone should ring
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X