Home
News

యూజర్లకు IRCTC షాక్: పలు డెబిట్ కార్డులు బ్లాక్ !

భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) డెబిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది.

By Hazarath

భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) డెబిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డుల పేమెంట్‌ గేట్‌వేను బ్లాక్‌ చేసింది. కన్‌వీనియన్స్‌ ఫీజు కారణంగా పలు బ్యాంకుల డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపివేసింది. వీటితో మీరు టికెట్లను బుక్ చేసుకోలేరని తెలిపింది.

పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా..అయితే ఈ యాప్ వాడండి !

 ఆరు బ్యాంకులు తప్ప

ఆరు బ్యాంకులు తప్ప

ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన అనేక బ్యాంకులకు చెందిన కార్డు వినియోగదారులకు అసౌకర్యం కలగనుంది. వారు టికెట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఈ మేరకు Financial Express పత్రిక రిపోర్ట్ చేసింది.

 ఈ బ్యాంకుల కార్డులకు మాత్రమే అనుమతి

ఈ బ్యాంకుల కార్డులకు మాత్రమే అనుమతి

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ఆరు బ్యాంకుల కార్డుదారుల కార్డు చెల్లింపులను మాత్రమే ఇప్పుడు అనుమతిస్తోంది.

 రూ.20 ఫీజును రద్దు చేస్తున్నట్లు

రూ.20 ఫీజును రద్దు చేస్తున్నట్లు

డీమానిటైజేషన్‌ తరువాత కస్టమర్లనుంచి వసూలు చేసే రూ.20 ఫీజును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ సమావేశాల్లో అనౌన్స్ చేసిన విషయం విదితమే.

ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారు

ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారు

ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారు స్లీపర్ క్లాస్ లో ప్రయాణించేందుకు రూ. 20లను, ఏసీ క్లాస్ లో ప్రయాణించేందుకు రూ.40లను టాక్స్ రూపంలో బ్యాంకులకు చెల్లించాలి. దీనినే IRCTC రద్దు చేసింది.

రోజుకు 50 వేల ట్రాన్సిక్షన్ల మీద మాకు నష్టం

రోజుకు 50 వేల ట్రాన్సిక్షన్ల మీద మాకు నష్టం

దీనిపై SBI సీనియర్ అధికారి స్పందిస్తూ..ఈ ఫీజు రద్దుతో రోజుకు 50 వేల ట్రాన్సిక్షన్ల మీద మాకు నష్టం వస్తుందని, IRCTC దీనిపై స్పందించడం లేదని చెబుతోంది.

బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును

బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును

కాగా ఈ ఫీజులో బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును ఆయా బ్యాంకులు చెల్లించకపోవడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

చర్చలు

చర్చలు

మరోవైపు దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), ఐఆర్‌సీటీసీ, ఇండియన్ రైల్వేశాఖతో చర్చించనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

 

 

ప్రస్తుతం బ్యాంకులు

ప్రస్తుతం బ్యాంకులు

ప్రస్తుతం బ్యాంకులు రూ.1000పైగా లావాదేవీలు జరిపిన వారి దగ్గర నుంచి 0.25శాతం ఎండీఆర్‌ను వసూలు చేస్తారు. వెయ్యి నుంచి రూ.2000 మధ్య లావాదేవీలు చేసే వారిపై గరిష్ఠంగా 0.5శాతం ఎండీఆర్‌ను వసూలు చేస్తారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా

మార్గదర్శకాలకు అనుగుణంగా

పెద్దనోట్ల సమయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఇచ్చిన తాత్కాలిక మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రేట్లను వసూలు చేయడం జరుగుతోంది.

గరిష్ఠంగా రూ.250వరకు రుసుమును

గరిష్ఠంగా రూ.250వరకు రుసుమును

అయితే.. ఫిబ్రవరి 16 తర్వాత ఆర్బీఐ తన మార్గదర్శకాలను హేతుబద్ధీకరణ చేయడంతో రూ.1 నుంచి రూ.1000 లావాదేవీలు చేసిన వారిపై రూ.5 ఫీజును వసూలు చేస్తున్నారు. రూ.1001 నుంచి రూ.2000 మధ్య లావాదేవీలు జరిపితే రూ.10లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అధిక మొత్తంలో లావాదేవీలు చేస్తే గరిష్ఠంగా రూ.250వరకు రుసుమును వసూలు చేస్తారు.

Best Mobiles in India

English summary
Train ticket booking: IRCTC stops debit card payment for several banks Read more at Gizbot Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X