Home
News

రూ.10కే రీఛార్జ్.. ఏడాది వ్యాలిడిటీ.. ట్రాయ్ అదిరిపోయే రూల్స్!

By Ram Kumar

దేశంలో 2G వాడుతున్న దాదాపు 15 కోట్ల మందికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఓ తీపి కబురు చెప్పింది. వీరంతా కేవలం కాలింగ్, మెసేజ్‌ల కోసమే ఫోన్లు వాడుతున్నా.. డేటా ప్లాన్లతో కూడిన భారీ రీఛార్జ్ ఖర్చులు భరించలేక సతమతమవుతున్నారు. దీంతో వీరికి ఊరటనిచ్చేలా ట్రాయ్ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై వీరికి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.

* రూ.10లకే రీఛార్జ్ ప్లాన్లు

ఇప్పటివరకు ఎయిర్‌టెల్, జియో, BSNL, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి టెలికాం కంపెనీలు ఎక్కువ ధరతోనే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇవి భారంగా మారాయి. దీన్ని గుర్తించిన ట్రాయ్.. ఇకనుంచి కనీసం రూ.10 లతో టాప్-అప్ వోచర్లను అందించాలని ఆదేశించింది.

Rs10 Recharges 365-Day Validity Coming Soon to India

అంతేకాదు, కంపెనీలు కేవలం రూ.10లకే పరిమితం కాకుండా.. తమకు నచ్చిన ధరకు రీఛార్జ్ ప్లాన్లను రూపొందించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు కలర్-కోడెడ్ రీఛార్జ్ కార్డులు కనిపించవు. ఆన్‌లైన్ రీఛార్జ్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

* 365 రోజుల వ్యాలిడిటీ, ఏడాదికోసారి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది..

ఇంతకుముందు స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) కేవలం 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి వ్యాలిడిటీని ఏకంగా 365 రోజులకు పెంచారు. దీంతో యూజర్లు ఎక్కువ కాలం పాటు తక్కువ ఖర్చుతో సర్వీసులు పొందవచ్చు.

* డేటా ఖర్చులకు గుడ్‌బై..

2G యూజర్ల కోసం ప్రత్యేకంగా వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు వీరు ఇంటర్నెట్ అవసరం లేకున్నా.. డేటా ప్లాన్లను కొనాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ బాధ తప్పుతుంది.

* రూల్స్ అమలులోకి వచ్చేశాయ్..

ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వెంటనే అమల్లోకి వచ్చేశాయి. టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్లను రూపొందించి విడుదల చేయడానికి కొన్ని వారాల సమయం తీసుకుంటాయి. అయితే ఈ నెలాఖరు నాటికి ఈ చౌకైన ప్లాన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి మండిపోతున్న రీఛార్జ్ ధరలకు పరిష్కారంగా ట్రాయ్ 2024, డిసెంబర్ 24నే ఈ రూల్స్‌ను తీసుకొచ్చింది. అయితే కంపెనీలు ఇంకా వీటిని జనవరి చివరి వారం నుంచి పట్టాలెక్కించనున్నాయి.

* పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట

ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2G వాడుతున్న కోట్లాది మందికి మొబైల్ సర్వీసులు మరింత అందుబాటులోకి రానున్నాయి. వారి అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరలో ప్లాన్లు అందుబాటులోకి రావడంతో.. నిశ్చింతగా కాలింగ్, మెసేజింగ్ చేసుకోవచ్చు. ట్రాయ్ తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం అని చాలామంది ప్రశంసిస్తున్నారు.

* మొత్తానికి 2G యూజర్లకు మనీ సేవ్

ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2G యూజర్లు ఇకపై రీఛార్జ్ ఖర్చుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్లు అందుబాటులోకి రావడంతో.. వీరికి నిజంగా పండగే అని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
TRAI's New Rules Rs10 Recharges 365-Day Validity Coming Soon to India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X