మార్కెట్‌లోకి ట్రాన్‌సెండ్ జెట్ ఫ్లాష్ 200 యుఎస్‌బి ఫ్లాష్ పెన్ డ్రైవ్స్

Posted By: Staff

మార్కెట్‌లోకి ట్రాన్‌సెండ్ జెట్ ఫ్లాష్ 200 యుఎస్‌బి ఫ్లాష్ పెన్ డ్రైవ్స్

ఇండియాలో మెమొరీ ప్రోడక్ట్స్ తయారీ రంగంలో నెంబర్ వన్ అయినటువంటి ట్రాన్‌సెండ్ అమ్ముల పోదిలోకి మరో క్రొత్త జెట్ ఫ్లాష్ 200 యుయస్‌‌బి ప్లాష్ డ్రైవ్‌ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ జెట్ ఫ్లాష్ 200 యుయస్‌‌బి విషయానికి వస్తే 25656-bit AES హార్డ్ వేర్‌ని ఎన్క్రిప్షన్ కలిగిఉండి డేటా సెక్యూర్‌ ఉండేవిధంగా రూపోందించబడింది.

అంతేకాకుండా ఎగస్ట్రా సెక్యూరిటీ కోసం ఈ జెట్ ఫ్లాష్‌లో ముందుగానే జెట్ ఫ్లాష్ సెక్యూర్‌డ్రైవ్ సాప్ట్‌వేర్ ఇనిస్టాల్ చేసి ఉంటుంది. దీని వల్ల యూజర్ యాక్సెస్ చేసేటటువంటి ప్రయివేట్ డేటాని పాస్‌వర్డ్ సంరక్షించుకోవచ్చు. ట్రాన్‌సెండ్ కొత్తగా రూపోందించినటువంటి ఈ జెట్ ఫ్లాష్ 200, యుఎస్‌‌బి 2.0టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే రాయడంలో 5MB/s, చదవడంలో 17MB/s సామర్ద్యం కలిగి ఉంటుంది.

ట్రాన్‌సెండ్ జెట్ ఫ్లాష్ 200మీకు 4GB, 8GB and 16GB మొమొరీ స్టోరేజిలలో లభించునున్నాయి. ఇక 4GB జెట్ ఫ్లాష్ ఖరీదు విషయానికి వస్తే రూ 910, 8GB జెట్ ఫ్లాష్ ఖరీదు విషయానికి వస్తే రూ 1,380. 16GB జెట్ ఫ్లాష్ ఖరీదు విషయానికి వస్తే రూ 2,570 ధరలలో లభ్యమవుతున్నాయి. ఇవి ప్రస్తుతానికి ఇండియాలోని అన్ని లీడింగ్ షాపుల్లో లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting