ఈ చెట్టు రోజూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తోంది,దేనిగురించో తెలుసా ?

By Gizbot Bureau
|

చెట్టు ట్విట్టర్లో ట్వీట్ చేయడమేంది.. ఈ వైబ్ సైటుకి ఏమైనా పిచ్చి పట్టిందా అని అందరూ అనుకుంటున్నారా..అయితే న్యూస్ చదివితే మీరే తెలుసుకుంటారు ఈ వార్త నిజమేనని. మనుషులు ట్విట్టర్లో వార్తలు ట్వీట్ చేస్తుంటారు. కాని ఈ చెట్టు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తోంది. ఇప్పటివరకూ 34 ట్వీట్లు చేసింది. దీనికి ఇప్పటికే 3145 మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఈ చెట్టు రోజూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తోంది,దేనిగురించో తెలుసా ?

 

ఈ చెట్టు పేరు A witness tree. ట్విట్టర్లో A witness tree అని కొడితే దాని పేజీ ఓపెన్ అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది ఏం ట్వీట్ చేస్తోంది అనే కదా మీ అనుమానం..ఈ చెట్టు కేవలం వాతావరణం గురించే ట్వీట్ చేస్తుంది.

 వారానికి ఆరుసార్లు టీట్లు

వారానికి ఆరుసార్లు టీట్లు

ఆమెరికా హార్వార్డ్ యూనివర్శిటీలోని అడవిలో ఈ ప్రత్యేకమైన ఓక్ చెట్టు ఉంది. అది తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వారానికి ఆరుసార్లు టీట్లు చేస్తుంది. మనుషులకు ఎలాగైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఆ చెట్టుకి కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయట. ప్రధానంగా వాతావరణం ఎలా ఉంది, భూమిలో నీరు లభిస్తోందా, గాలి బాగా వీస్తోందా ఇలాంటి విషయాలపై అది టీట్లు చేస్తోంది.

కాండం, వేర్లు, కొమ్మలకు సెన్సార్లు

కాండం, వేర్లు, కొమ్మలకు సెన్సార్లు

చెట్టు ట్వీట్ చెయ్యడమేంటన్న ప్రశ్నకు కూడా సమాధానం ఉంది.టిమ్ రాడెమ్షర్ అనే రీసెర్చ్ స్టూడెంట్.. ఈ చెట్టు కాండం, వేర్లు, కొమ్మలకు సెన్సార్లు సెట్ చేశాడు. వాటిని సైన్స్‌లో డెండ్రోమీటర్లు అంటున్నారు. వాటిని ఓ కంప్యూటర్‌కి లింక్ చేశారు.

కంప్యూటర్తో అనుసంధానం
 

కంప్యూటర్తో అనుసంధానం

చెట్టు కాండం ద్వారా ప్రవహించే ద్రవం ఎంత ఉందో, నేలల్లో వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతుందో, వాతావరణం, ఉష్ణోగ్రత ఎలా ఉందో, ఆ సెన్సార్లు గమనిస్తూ ఉంటాయి. ఆ వివరాల్ని కంప్యూటర్‌కి పంపిస్తాయి. వాటి ఆధారంగా ఆ కంప్యూటర్ ఆటోమేటిక్ ట్వీట్లను వేస్తోంది. దీని ట్వీట్లను చూడాలనుకున్నవారు https://twitter.com/awitnesstree/with_replies ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

ట్వీట్ల సారాశం ఇదే

ట్వీట్ల సారాశం ఇదే

ఈ చెట్టు నుంచి జులై 17న తొలి ట్వీట్ నమోదైంది. కాగా ఇంటర్నెట్‌లో అతి పురాతన జీవిని నేనే అని ఈ చెట్టు తన ప్రొఫైల్ లో రాసుకుంది. 2 రోజుల నుంచీ ఎండ దంచేస్తోందని ఓ ట్వీట్.. ఈ వేడి గాలులు ఎప్పుడు తగ్గుతాయో అని జులై 21న మరో ట్వీట్ ట్వీటింది. చూడండి నా కాండం, కొమ్మలు వేగంగా పెరుగుతున్నాయని జులై 22న మరో ట్వీట్ పెట్టింది. జులై నెల సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉందని ఆగస్ట్ 1న ఇంకో ట్వీట్ వేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tree Live Tweeting About Climate Change with scientists hep

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X