మార్కెట్లోకి దూసుకొస్తున్న సరికొత్త స్మార్ట్ బైక్స్

By Anil
|

రోజు రోజుకి స్మార్ట్ వస్తువులకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ లిస్ట్ లోకి ఎలిక్ట్రిక్ బైక్స్ కూడా చేరిపోయాయి .ఈ నేపథ్యంలో TRONX మోటార్స్ అనే కంపెనీ, బుధవారం భారతదేశం యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయిన TRONX One అనే ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ-బైక్ ధర రూ. 49,999 గా కంపెనీ నిర్ణయించింది.అప్పుడే ఈ బైక్స్ కు ప్రీ ఆర్డర్స్ కూడా మొదలైనట్టు కంపెనీ తెలిపింది . అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మగ్మా రెడ్ మరియు పసిఫిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది బ్యాటరీ ను ఒక్క సారి ఛార్జ్ చేస్తే 70kms నుండి 85kms వరకు వెళ్తుంది అని కంపెనీ తెలిపింది . ఈ బైక్ బుక్ చేసిన మొదటి బ్యాచ్ వినియోగదారుల కోసం జూలై 16 న షిప్పింగ్ ప్రారంభిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ బైక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునేవారు ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

సరికొత్త ఫీచర్లు:

సరికొత్త ఫీచర్లు:

లాక్,అన్ లాక్ ఆప్షన్, డిస్‌ప్లే యూనిట్ మరియు నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ TRONX One ఎలెక్టిక్ బైక్స్ తయారు చేయబడింది. స్మార్ట్ ఫోన్ లోని యాప్స్ ద్వారా ఫిట్నెస్ గోల్స్ సెట్ చేసుకునే అవకాశం TRONX మోటార్స్ కలిపిస్తుంది.

బ్యాటరీ మరియు రేంజ్:

బ్యాటరీ మరియు రేంజ్:

ఈ ఎలక్ట్రిక్ బైక్స్ కు ఎటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు ఎందుకంటే ఈ బ్యాటరీను అవసరమైనప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాటరీను తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బైక్ స్పీడ్ 25కిలోమీటర్లు కాబట్టి లైసెన్స్ తో ఎటువంటి అవసరం లేదు.ఈ ఎలక్ట్రిక్ బైక్ 500 W లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది.బాటరీ ను 2 గంటలు ఛార్జ్ చేస్తే సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.అదే ఎలక్ట్రానిక్ గేర్ అసిస్ట్ మోడ్ లో అయితే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70km నుంచి 80km వరకు ప్రయాణం చేయవచ్చు.

రైడింగ్ మోడ్స్:
 

రైడింగ్ మోడ్స్:

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి వీటిలో ఒకటి పూర్తిగా మోటార్ తో వెళ్ళవచ్చు రెండవది సైకిల్ peddel మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లొచ్చు.రెండవ మోడ్ లో కిక్ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది , ఇందులో మోటారు చిత్రం కనిపిస్తుంటుంది మోటార్ తో ప్రయాణించాలి అనుకుంటే వెంటనే ఆప్షన్ బటన్ నొక్కితే సరిపోతుంది.

12 ప్రధాన నగరాల్లో లాంచ్ :

12 ప్రధాన నగరాల్లో లాంచ్ :

ఢిల్లీ , ముంబై, బెంగుళూరు, చెన్నై మరియు పూణితో సహా 12 ప్రధాన నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ను కంపెనీ లాంచ్ చేసింది.ప్రతి ప్రధాన నగరాలలో సర్వీస్ సెంటర్ను కూడా ప్రారంభించినట్టు కంపెనీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Tronx One, India's first smart crossover electric bike, launched at Rs 49,999.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X