Truecaller ద్వారా ఫోన్ కాల్‌లను ఇకమీదట రికార్డింగ్ చేయలేరు!!

|

ట్రూకాలర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రముఖ వాయిస్ కాలింగ్ యాప్ ట్రూకాలర్ ఇప్పుడు రికార్డింగ్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ తన ప్లేస్టోర్ పాలసీని అప్‌డేట్ చేసినట్లు గూగుల్ ఇటీవల ప్రకటించిన వెంటనే ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ యాప్‌ను ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులు నిర్దిష్ట ప్రాంతాలలో ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయడానికి ఇప్పటికీ అనుమతిస్తుంది. కాకపోతే మే 11 కాల్ రికార్డింగ్ నిలిపివేయనున్నది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత ప్రైవసీని అందించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా కాల్ రికార్డింగ్ చట్టాలకు లోబడి ఉండటానికి గూగుల్ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

వాయిస్ కాల్‌ల రికార్డ్

వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయడానికి వినియోగదారులను అనుమతించిన ట్రూకాలర్ యాప్ నుండి ఈ ఫీచర్‌ను తీసివేయనున్నది. ఇప్పటి వరకు యాప్ రికార్డింగ్ ఫీచర్‌ను వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో అందించే ఇన్-బిల్ట్ ఎంపిక కానందున ఇది యాప్ నుండి తీసివేయబడుతుంది.

 

 

ఇన్-బిల్ట్ సిస్టమ్‌తో వాయిస్ కాల్ రికార్డింగ్‌కి అనుమతి

ఇన్-బిల్ట్ సిస్టమ్‌తో వాయిస్ కాల్ రికార్డింగ్‌కి అనుమతి

గూగుల్ ముందుగా లోడ్ చేసిన మరియు అంతర్నిర్మిత ఫీచర్ ద్వారా మాత్రమే వాయిస్ కాలింగ్ రికార్డింగ్‌ను అనుమతించబోతోంది. కావున వినియోగదారులు ఇప్పటికీ వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయగలరు. కానీ థర్డ్-పార్టీ అప్లికేషన్‌లతో మాత్రం ఫోన్ కాల్ లను రికార్డింగ్ చేయలేరు. డిఫాల్ట్ కాలింగ్ యాప్‌లో ముందే లోడ్ చేయబడిన వాయిస్ కాలింగ్ రికార్డింగ్ ఫీచర్‌తో తమ స్మార్ట్‌ఫోన్‌లను అందించే అనేక కంపెనీలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం వాయిస్ కాల్ రికార్డింగ్‌ ఫీచర్ ట్రూకాలర్ దాని వినియోగదారుల కోసం నిలిపివేయనున్నది. అయితే సంబంధం లేకుండా వినియోగదారులు ఇప్పటికీ పరికరాన్ని లౌడ్ స్పీకర్‌లో ఉంచి మొత్తం సంభాషణను రికార్డ్ చేయడానికి మరొక ఫోన్‌ని ఉపయోగించవచ్చు.

గూగుల్ ప్రైవసీ
 

గూగుల్ ప్రైవసీను ప్రోత్సహించాలని మరియు వారి అనుమతి లేకుండా వారి కాల్‌లను రికార్డ్ చేయబడవని వినియోగదారులకు మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటుంది. ప్రస్తుతం వాయిస్ కాల్ లను రికార్డు చేయడం కోసం చాలా స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ యాప్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ముందుగానే లోడ్ చేయబడి వస్తుంది. అయితే ఇది కాల్‌లను రికార్డింగ్ చేస్తున్నట్లు ఇరుపక్షాలకు తెలియజేస్తుంది. ఇది వినియోగదారులకు కాల్‌లను రికార్డ్ చేయడానికి స్వేచ్ఛను ఇస్తుంది. అయితే ప్రతి ఒక్కరి గోప్యతను కూడా సురక్షితంగా ఉంచుతుంది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ ప్రతిస్పందనలు వస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Truecaller App End Call Recording Feature as Google New Updates Play Store Policy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X