Home
News

ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్రూకాలర్ లైవ్ కాలర్ ఐడీ వచ్చేసింది.. ఇక స్పామ్ కాల్స్‌కు గుడ్ బై!

Truecaller In iPhones: ఐఫోన్ వాడుతున్నారా.. అయితే మీకోసం అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్రూకాలర్ లైవ్ కాలర్ ID ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు కూడా వచ్చేసింది. అంటే, ఇకపై మీకు ఎవరు ఫోన్ చేసినా, వాళ్ల పేరు వెంటనే మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ ఫీచర్ iOS 18.2 అప్‌డేట్‌తో వస్తోంది.

యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన 'లైవ్ కాలర్ ID లుకప్' ఫ్రేమ్‌వర్క్ ద్వారా దీన్ని తీసుకురావడం సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఫీచర్ మీ డేటాను చాలా భద్రంగా చూసుకుంటుంది. హోమోమార్ఫిక్ ఎన్‌క్రిప్షన్ అనే టెక్నాలజీని వాడటం వల్ల, యూజర్ల ప్రైవసీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండానే, కాలర్ ID కనిపిస్తుంది.

Truecaller Brings Live Caller ID to iPhones  Here s How to Unlock the Feature

* కొత్త అప్‌డేట్‌తో వచ్చే ఫీచర్లు ఇవే

- లైవ్ కాలర్ ఐడీ

ఈ ఫీచర్ సాయంతో ఇకపై ఐఫోన్ యూజర్లు కూడా ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో వెంటనే తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో ఉన్నట్టుగానే, ఐఫోన్‌లోనూ ట్రూకాలర్ పనిచేస్తుంది.

- స్పామ్ కాల్ బ్లాకింగ్

ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరి కోసం స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. దీనివల్ల మీకు చిరాకు తెప్పించే కాల్స్ రాకుండా ఉంటాయి.

- పాత కాల్స్ సెర్చ్

గతంలో వచ్చిన 2,000 కాల్స్ వరకు మీ ఫోన్ కాల్ లిస్ట్‌లో సెర్చ్ చేసుకోవచ్చు.

- ప్రీమియం యాక్సెస్

లైవ్ కాలర్ ID, యాడ్స్ లేకుండా యాప్ వాడాలంటే మాత్రం ట్రూకాలర్ ప్రీమియం తీసుకోవాల్సిందే. ఇందుకోసం వ్యక్తిగత ప్రీమియం ప్లాన్ నెలకు 9.99 డాలర్లు లేదా సంవత్సరానికి 74.99 డాలర్లు చెల్లించాలి. అలాగే ఫ్యామిలీ ప్లాన్ లో నెలకు 14.99 డాలర్లు లేదా సంవత్సరానికి 99.99 డాలర్లు (నలుగురు వరకు వాడుకోవచ్చు) చెల్లించాలి. అలాగే గోల్డ్ ప్లాన్ కోసం సంవత్సరానికి 249 డాలర్లు ఖర్చు చేయాలి

* ఐఫోన్‌లో ట్రూకాలర్ లైవ్ కాలర్ ID ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?

స్టెప్ 1: మీ ఐఫోన్‌ను iOS 18.2 లేదా ఆ తర్వాత వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.

స్టెప్ 2: ట్రూకాలర్ యాప్‌ను 14.0 లేదా ఆ తర్వాత వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.

స్టెప్ 3: ఐఫోన్ సెట్టింగ్స్‌లో 'ఫోన్' ఆప్షన్‌కు వెళ్లి 'కాల్ బ్లాకింగ్ & ఐడెంటిఫికేషన్' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4: ట్రూకాలర్‌కు సంబంధించిన అన్ని స్విచ్‌లను ఆన్ చేయాలి. ట్రూకాలర్ యాప్‌ను ఓపెన్ చేసి సెటప్ పూర్తి చేస్తే సరిపోతుంది

ఈ అప్‌డేట్ ఐఫోన్ యూజర్ల కోసం ట్రూకాలర్ యాప్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఆండ్రాయిడ్‌తో సమానంగా ఐఫోన్ యాప్‌ను తీసుకురావడమే తమ లక్ష్యమని ట్రూకాలర్ CEO రిషిత్ జున్‌జున్‌వాలా తెలిపారు. ఈ అప్‌డేట్ ద్వారా పవర్ ఫుల్ ఫీచర్లను అందిస్తూనే, యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా చూస్తున్నామని ఆయన అన్నారు.

యాపిల్ కూడా కాల్ ఐడీ ID ఫీచర్‌ను అందిస్తుంది. కానీ ట్రూకాలర్ దగ్గర ఎక్కువ ఫోన్ నంబర్ల డేటాబేస్ ఉండటం వల్ల, కచ్చితమైన కాలర్ IDని గుర్తించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడంలో ట్రూకాలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ 2025, జనవరి 22 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఐఫోన్ యూజర్లను మరింతగా ఆకర్షించాలని ట్రూకాలర్ భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Truecaller introduces live caller ID and spam blocking for iPhones with iOS 18.2. Premium users get extra features. It launched on January 22, 2025, enhancing the user experience.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X