Home
News

స్పామ్‌ కాల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా... ట్రూకాలర్‌ ఆటో బ్లాక్‌ స్పామ్ ఫీచర్‌ గురించి తెలుసుకోండి..!

ట్రూకాలర్‌ తాజాగా కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పామ్‌ కాల్స్‌, మోసపూరిత కాల్స్‌ను నివారించేందుకు ఆటో బ్లాక్‌ స్పామ్‌ పేరుతో (Truecaller Auto Block Spam Feature) ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ను ఐఫోన్‌ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ ప్రస్తుతం ఉన్న స్పామ్‌ బ్లాక్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని ట్రూకాలర్‌ చెబుతోంది. అన్ని రకాల మోసపూరిత కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్‌ చేస్తుందని తెలిపింది.

ఈ ఫీచర్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ రింగ్‌ అయ్యే అవకాశం లేదని, ఈ కాల్స్‌ అన్నీ ఆటోమేటిక్‌గా బ్లాక్‌ కానున్నాయని ట్రూకాలర్‌ తెలిపింది. కాల్స్‌ జాబితాలో Missed కాల్‌గా కనిపించనున్నాయి. ఫలితంగా ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం కాలర్‌ ఐడెంటిటీ వివరాలను అందిస్తున్న ట్రూకాలర్‌, కొత్త ఫీచర్‌ ద్వారా వినియోగదారులకు స్పామ్ కాల్స్‌ నుంచి రక్షిస్తుంది.

Truecaller auto block spam feature

రెండు ఆప్షన్‌లు ఉంటాయి :
ట్రూకాలర్‌ ఆటో బ్లాక్‌ స్పామ్‌ ఫీచర్‌లో రెండు స్థాయిల్లో రక్షణను కలిగి ఉంటుంది. మీకు అవసరమైన ఆప్షన్‌ ను ఎంచుకోవచ్చు. బ్లాక్‌ టాప్‌ స్పామర్స్‌ (Block Top Spammers), బ్లాక్ ఆల్‌ స్పామర్స్‌ (Block All Spammers) వంటి రెండు స్థాయిలో రక్షణను ఎంచుకోవచ్చు.

అవసరమైన కాల్స్‌ కూడా బ్లాక్‌ :
బ్లాక్‌ టాప్ స్పామర్స్‌ ఆప్షన్‌ ఎంచుకొంటే తరచూ మోసాలకు పాల్పడుతున్న నంబర్లను మాత్రమే బ్లాక్ చేస్తుంది. అదే బ్లాక్‌ ఆల్‌ స్పామర్స్‌ ఆప్షన్‌ ను ఎంచుకొంటే అన్ని స్పామ్ నంబర్లను బ్లాక్‌ చేస్తుంది. అయితే కొన్ని అవసరమైన కాల్స్‌ కూడా బ్లాక్‌ చేసే అవకాశం ఉంది. ఈ కాల్స్ అన్ని కాల్‌ లాగ్‌ లో స్కామర్ లేదా ఫ్రాడ్‌ పేరుతో కనిపిస్తాయి.

వీరికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది :
ట్రూకాలర్‌ ప్రీమియం లేదా ఐఫోన్ iOS 18 అప్‌డేట్‌ పొందిన ఐఫోన్‌ వినియోగదారులు ఆటో బ్లాక్‌ స్పామ్‌ ఫీచర్‌ ను వినియోగించుకోవచ్చు. ట్రూకాలర్ యాప్‌లోని ప్రొటెక్ట్‌ ట్యాబ్‌ లోకి వెళ్లాలి. అనంతరం ఆటో బ్లాక్‌ స్పామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రియల్‌టైం లో స్పామ్‌ కాల్స్‌ను నియంత్రిస్తుంది.

ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్‌ సమస్య ఎక్కువగా ఉంటోంది. కొన్నిసార్లు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆటో బ్లాక్ స్పామ్‌ ఫీచర్‌ కారణంగా ఐఫోన్‌ యూజర్లు ఈ సమస్యలను నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఐఫోన్‌ యూజర్ల కోసం మరిన్ని ఫీచర్‌లను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Truecaller launches auto block spam feature and know how it controls spam calls
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X