ట్రూకాలర్ వాడేవారికి బ్యాడ్ న్యూస్, డేటా హ్యాక్ అవుతోంది

ట్రూకాలర్‌ యాప్‌‌ వాడుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా యూజర్లున్న ఈ కాలర్‌‌ ఐడెంటిటీ యాప్‌‌లోని వినియోగదారుల డేటా అమ్మకానికి రెడీగా ఉందట. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డ

|

ట్రూకాలర్‌ యాప్‌‌ వాడుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా యూజర్లున్న ఈ కాలర్‌‌ ఐడెంటిటీ యాప్‌‌లోని వినియోగదారుల డేటా అమ్మకానికి రెడీగా ఉందట. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్ పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది.

 ట్రూకాలర్ వాడేవారికి బ్యాడ్ న్యూస్, డేటా హ్యాక్ అవుతోంది

జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌లో దొరుకుతోంది.ప్రైవేట్‌‌ ఇంటర్నెట్‌‌ ప్లాట్‌‌ఫాంలో ఈ డేటాను అమ్మకానికి పెట్టారని ఇలాంటి లావాదేవీలపైనే కన్నేసి ఉంచే ఓ సైబర్‌‌ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించారు.

రూ.1.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు

రూ.1.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు

ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది యూజర్లున్న ఈ యాప్‌‌ డేటాను ఓ డార్క్‌‌ వెబ్‌‌లో రూ.1.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్మకానికి పెట్టారని ఆయన చెప్పారు. కాగా 14 కోట్ల మందిలో 60 నుంచి 70 శాతం ఇండియన్లదని సమాచారం.ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది.

 డేటా ఎవరైనా పొందొచ్చు

డేటా ఎవరైనా పొందొచ్చు

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోని లక్షలాది మంది సెలబ్రిటీలు, ముఖ్యమైన వ్యక్తుల వ్యక్తిగత సమాచారం బయటకొచ్చిందని వార్తలొచ్చిన కొద్దిరోజుల్లోనే ట్రూకాలర్‌‌ డేటా వార్త సంచలనం రేపుతోంది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఇలా మొత్తం డేటా ఎవరైనా పొందొచ్చు.

 డార్క్ వెబ్ లో యూజర్లకు
 

డార్క్ వెబ్ లో యూజర్లకు

ట్రూ కాలర్ మొబైల్ యాప్ బేసిడ్ గ్లోబల్ యూజర్లు 140 మిలియన్లు (14 కోట్లు) మంది ఉండగా.. డార్క్ వెబ్ లో యూజర్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారం అత్యధికంగా 25వేల యూరోలు (రూ.19.45 లక్షలు)గా సేల్ చేస్తున్నట్టు గుర్తించింది. వారిలో ఇండియన్ యూజర్లకు చెందిన పర్సనల్ డేటా 60 నుంచి 70 శాతం 2వేలు యూరోలు (రూ.1.55 లక్షలు) వరకు అమ్మకానికి ఉన్నట్టు నివేదిక తెలిపింది.

ట్రూకాలర్ స్పందన

ట్రూకాలర్ స్పందన

ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు సంబంధించి ముందుగా స్వీడన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెలుగులోకి తెచ్చింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అనధికారంగా కాపీ చేస్తున్నట్టు గుర్తించింది.కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై ట్రూకాలర్ స్పందించింది.

 డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు

డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు

ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్‌ కాలేదని ఖండించింది. కొందరు యూజర్లు తమ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారని ట్రూకాలర్ వాదన. డేటా లీక్ వ్యవహారం సంచలనం రేపుతుండటంతో క్షుణ్ణంగా విచారణ జరిపామని, డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు లభించలేదని ట్రూకాలర్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. శాంపిల్ డేటా ట్రూకాలర్ డేటాతో మ్యాచ్ కాలేదని వెల్లడించారు.

యూజర్ల ప్రైవసీకి ముప్పు కలగకుండా చర్యలు

యూజర్ల ప్రైవసీకి ముప్పు కలగకుండా చర్యలు

యూజర్ల డేటా తమ సర్వర్లలో సురక్షితంగా ఉందని, యూజర్ల ప్రైవసీకి ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తమ డేటాబేస్ లోని ఫైనాన్షియల్ డేటాను కూడా చెక్ చేశామని ఎలాంటి ఉల్లంఘనకు అవకాశం లేదని తెలిపింది. ట్రూకాలర్ వాదన ఇలా ఉంటే, భారీస్థాయిలో డేటా లీకైందని సైబర్ నిపుణులు నమ్ముతున్నారు.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI)

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI)

ట్రూ కాలర్.. గ్లోబల్ కాంటాక్ట్ బుక్ సర్వీసు మాత్రమే కాకుండా.. ఇండియాలోని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI) పేమెంట్ ఆప్షన్ అందిస్తోంది.

ఫేస్‌‌బుక్‌‌

ఫేస్‌‌బుక్‌‌

సోషల్‌‌ మీడియా దిగ్గజం ఫేస్‌‌బుక్‌‌ తన యూజర్ల డేటాను వాళ్లకు తెలియకుండానే, అనుమతి లేకుండానే 50కి పైగా దేశాల్లోని100 టెలికాం, ఫోన్‌‌ తయారీ కంపెనీలకు ఆఫర్‌‌ చేస్తోందని తెలిసింది. స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడుతున్న యూజర్లే టార్గెట్​గా యాడ్స్‌‌ కోసం ఫేస్‌‌బుక్‌‌ ఈ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. ఆ వార్తలను ఫేస్‌‌బుక్‌‌ కొట్టిపారేసింది.

Best Mobiles in India

English summary
truecaller personal data leaked, millions of indians data available in dark web.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X