Home
News

Truecallerలో కొత్తగా 'స్కామ్‌ఫీడ్' ఫీచర్.. దీని ప్రయోజనాలు ఏంటంటే..!

Truecaller Scamfeed: మన దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ యాప్ ట్రూకాలర్ (Truecaller) ఒక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాని పేరే 'స్కామ్‌ఫీడ్' (Scamfeed). ఇది యాప్‌లోనే ఉండే ఒక ప్రత్యేకమైన విభాగం. దీని ద్వారా, మనకు ఎదురైన మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల గురించి మనమే స్వయంగా ఇతరులను హెచ్చరించవచ్చు.

అలాగే ఇతరులు షేర్ చేసిన మోసాల గురించి తెలుసుకోవచ్చు. అంటే, మనలాంటి యూజర్లందరినీ ఏకం చేసి, మోసాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఒక లైవ్ వార్నింగ్ సిస్టమ్‌ను ట్రూకాలర్ రూపొందిస్తోంది. దీనివల్ల, ఎవరు ఎలాంటి మోసాలకు గురయ్యారు, కొత్తగా ఎలాంటి మోసాలు పుట్టుకొస్తున్నాయి వంటి విషయాలు వెంటనే తెలుసుకోవచ్చు.

Truecaller Scamfeed

* స్కామ్‌ఫీడ్ అంటే ఏంటి, పనిచేస్తుంది..?

మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతి కనిపెడుతున్న ఈ రోజుల్లో, మనల్ని మనమే రక్షించుకోవడానికి మనమే నిర్మించుకున్న ఒక డిజిటల్ రక్షణ కవచంలా ఈ స్కామ్‌ఫీడ్ పనిచేస్తుందని ట్రూకాలర్ బలంగా నమ్ముతోంది. స్కామ్‌ఫీడ్ అనేది ట్రూకాలర్ యాప్‌లోనే లైవ్‌గా పనిచేసే ఒక కమ్యూనిటీ ఫీచర్. అంటే, మనందరం కలిసి నడిపించే ఫీచర్ అన్నమాట.

* మీ అనుభవాన్ని పంచుకోండి, ఇతరుల రిపోర్ట్స్ చూడండి..

మీకు ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినా, లేదా ఏదైనా మోసపూరిత ప్రయత్నం జరిగినా.. వెంటనే దాని గురించి స్కామ్‌ఫీడ్‌లో పోస్ట్ చేసి నలుగురినీ అలర్ట్ చేయొచ్చు. మీకు వచ్చిన కాల్ లేదా మెసేజ్ గురించి ఇప్పటికే ఎవరైనా రిపోర్ట్ చేశారేమో కూడా ఈ ఫీడ్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

* అన్ని రకాల మోసాలకు చెక్

డబ్బులు కొట్టేసే ఫిషింగ్ (Phishing) మోసాలు, ప్రముఖుల పేరు చెప్పి చేసే మోసాలు (Impersonation), బ్యాంక్ మోసాలు (Financial Fraud), ప్రేమ పేరుతో జరిగే మోసాలు.. ఇలా అన్ని రకాల మోసాల గురించి ఇక్కడ సమాచారం ఉంటుంది. మీరు రిపోర్ట్ చేసినప్పుడు మీ పేరు కనిపించకూడదు అనుకుంటే, ఆ అవకాశం కూడా ఉంది.

* చర్చించండి, షేర్ చేయండి

పోస్టులపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయొచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్ (WhatsApp) లాంటి యాప్స్‌లో షేర్ చేసి మరింత మందికి చేరవేయొచ్చు. దీనివల్ల, స్కామ్‌ల గురించి చాలా వేగంగా, నమ్మదగిన సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫలితంగా సైబర్ క్రైమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి.

* ఇప్పుడీ స్కామ్‌ఫీడ్ ఎందుకంత ముఖ్యం..?

ట్రూకాలర్ ప్రకారం, స్కామ్‌ఫీడ్ కేవలం ఒక టూల్ కాదు, ఇదొక ఉద్యమం లాంటిది. ఎందుకంటే ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ మారిపోతుంటే, ఏం చేయాలో తెలియక చాలామంది నిస్సహాయంగా ఫీల్ అవుతారు. స్కామ్‌ఫీడ్ వారికి ఒక గొంతుకని, ఒక వేదికని ఇస్తుంది. ఇది మనందరి మధ్య ఒక సపోర్ట్ సిస్టమ్‌లా పనిచేస్తుంది.

ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ఇతరుల అనుభవాలు చదవడం వల్ల, మోసాల లక్షణాలు (Warning Signs) ఎలా ఉంటాయో అర్థమవుతుంది. దానివల్ల మనం సులభంగా వాటి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. దీంతో చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఇంకా డేటా కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ట్రూకాలర్ ప్రొడక్ట్ డైరెక్టర్, టోన్మోయ్ గోస్వామి (Tonmoy Goswami) తాజాగా మీడియాతో మాట్లాడుతూ, "మోసగాళ్ల కంటే ఒక అడుగు ముందుండాలంటే మనమందరం కలవడమే కీలకం. స్కామ్‌ఫీడ్ ద్వారా యూజర్లు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, సమాచారాన్ని పంచుకుంటారు, ఒకరినొకరు రక్షించుకుంటారు." అని అన్నారు.

* డిజిటల్ సేఫ్టీకి భరోసా, యూజర్లలో నమ్మకం..

స్కామ్‌ఫీడ్ కేవలం యూజర్లను రక్షించడమే కాదు, కమ్యూనికేషన్‌ను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా మార్చాలనే ట్రూకాలర్ లక్ష్యాన్ని కూడా బలపరుస్తుంది. ఇలాంటి ఫీచర్లు యూజర్లలో ట్రూకాలర్‌పై నమ్మకాన్ని పెంచుతాయి, యాప్‌ను మరింత ఎక్కువగా వాడేలా ప్రోత్సహిస్తాయి. ఎక్కువ మంది తమ అనుభవాలను, హెచ్చరికలను పంచుకున్న కొద్దీ, ఈ స్కామ్‌ఫీడ్ వ్యవస్థ మరింత పటిష్టంగా, ప్రభావవంతంగా మారుతుంది.

* ట్రూకాలర్‌కూ లాభం

యూజర్ల నుంచి వచ్చే సమాచారం (Feedback) ద్వారా, కొత్తగా వస్తున్న స్కామ్ ట్రెండ్స్ గురించి ట్రూకాలర్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండగలదు. ప్రస్తుతం ఈ స్కామ్‌ఫీడ్ ఫీచర్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు కూడా పరిచయం చేయనున్నారు.

స్కామ్‌లను ఎలా గుర్తించాలి, ఎలా రిపోర్ట్ చేయాలి అనే మరిన్ని వివరాల కోసం మీరు www.truecaller.com/scam-alert వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Best Mobiles in India

English summary
Truecaller Scamfeed Crowdsourcing Real-Time Alerts to Fight Digital Scams in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X