Home
News

Truecaller Spam Model స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ట్రూకాలర్‌ కొత్త టూల్‌ విడుదల..!

భారత్‌లో ఫోన్‌ వినియోగదారులు ఎక్కువగా స్పామ్‌ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ట్రూకాలర్‌ సరికొత్త టూల్‌ను (Truecaller Spam Model) లాంచ్‌ చేసింది. ఈ మేరకు X వేదికగా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. భారీ స్థాయిలో స్పామ్‌ కాల్‌ను గుర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.

ఈ స్పామ్‌ టూల్‌ విడుదల సందర్భంగా ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు అలాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తమ వినియోగదారుల కోసం దీన్ని రూపొందించినట్లు చెప్పారు. తన వినియోగదారుల రక్షణ కోసం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. మరింత మెరుగ్గా ఈ కొత్త టూల్‌ స్పామ్‌ కాల్స్‌ను నియంత్రిస్తుందని చెప్పారు.

Truecaller Spam Model launched for indian users

దీంతోపాటు ట్రూకాలర్‌ ఇటీవలే ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు మరింత సౌకర్యవంతంగా ఈ ట్రూకాలర్‌ సేవలను వినియోగించుకొనేందుకు ఈ సర్వీసులను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్లను మాత్రమే ఈ వెబ్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

అన్ని విండోస్‌, Mac బ్రౌజర్లలోనూ ట్రూకాలర్ వెబ్‌ పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా మెసెజ్‌లను పంపడం, రిసీవ్‌ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఫోన్‌ నంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఫోన్‌ నంబర్‌ను లింక్ చేశాక.. ట్రూకాలర్ వినియోగదారుల బిజినెస్‌ మెసెజ్‌లు, ఇన్‌స్టంట్‌ మెసేజ్‌లు, SMS మెసేజ్‌లను చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు 100MB వరకు డేటాను బదిలీ చేసుకోవచ్చు.

సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ నేరాలు భారత్‌లో రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 2024 లో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI).. కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఎవరు ఫోన్‌ చేసిన వారి పేరు మొబైల్ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ సప్లిమెంటరీ సర్వీసులను (CNAP) అన్ని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లలో సేవ్‌ చేసుకున్న వారి పేర్లు మాత్రమే వారు కాలింగ్‌ చేసినప్పుడు డిస్‌ప్లే పైన కనిపిస్తున్నాయి. థర్ట్‌ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నట్లయితే క్లౌడ్‌ సోర్స్‌ ఆధారిత వివరాలు కనిపిస్తున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ సిఫార్సులు అమల్లోకి వస్తే ఎవరూ ఫోన్‌ చేసినా వారి వివరాలు వెల్లడి అవుతాయి. కొత్త సిమ్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడు కస్టమర్‌ అప్లికేషన్‌ ఫాంలో నమోదు చేసిన వివరాలు మాత్రమే ఫోన్‌ చేసినప్పుడు కనిపిస్తాయి.

ఇటీవల గూగుల్‌ కూడా ట్రూకాలర్‌ తరహా సేవలు అందించే విధంగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త టూల్‌ గూగుల్‌ లుక్‌అప్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్‌ 127.0.620688474 లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గూగుల్‌ Lookup టూల్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని వివరాలు వెల్లడి కాలేదు. జూన్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Truecaller Spam Model launched for indian users for detection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X