Truecaller సర్వే: లైంగిక వేధింపులను అధికంగా ఎదుర్కొంటున్న ఇండియా మహిళలు

|

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు ట్రూకాలర్ తన నివేదిక యొక్క మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇందులో గల సారాంశం ప్రకారం భారతదేశంలోని మహిళలు ఫోన్ కాల్స్ మరియు SMS ల ద్వారా వేధింపులకు గురి అవుతున్న వారి వివిరాలను వెళ్ళడించింది.

లైంగిక వేధింపుల సమస్య

ఈ నివేదికలో భారతదేశంలోని ప్రతి 5 మందిలో ఒక మహిళ లైంగిక వేధింపుల సమస్యతో బాధపడుతున్నది. ఇందులో ముఖ్యముగా అనుచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ తో పాటుగా SMSలు వస్తాయని తేలింది. అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసే రిపోర్ట్ రేటు భారతదేశంలోనే అధికంగా ఉంది.

 

 

టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ "రెస్సో" మీరు ట్రై చేయండి!!!!

ఇండియాలో లైంగిక వేధింపుల కాల్స్ శాతం

ఇండియాలో లైంగిక వేధింపుల కాల్స్ శాతం

భారతదేశంలో 85% మంది మహిళలు తమకు వచ్చిన అనుచితమైన కాల్స్ నెంబర్లను బ్లాక్ చేసినట్లు ట్రూకాలర్ నివేదించింది. ఇందులో 45% మంది మహిళలు తమ టెలికాం ఆపరేటర్ యొక్క సహాయం కోరగా మరో 45% మంది మహిళలు రాంగ్ నంబర్ కోసం వెతకడానికి ప్రయత్నించారు. ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఎంచుకున్న మహిళలు ఇంకా ఎలా ఉన్నారో కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. 44% మంది మహిళలు ఇటువంటి ఫోన్ కాల్స్ ను విస్మరించాలని ఎంచుకున్నారు. ఇంకా 12% కంటే తక్కువ మంది మహిళలు ఈ అనుచిత నెంబర్ ను అధికారులకు నివేదించారు అని ట్రూకాలర్ తెలిపింది.

 

 

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌

ట్రూకాలర్ నివేదిక

ట్రూకాలర్ నివేదిక

ట్రూకాలర్ యొక్క సర్వేలో వేధింపుల కాల్స్ 76% కంటే ఎక్కువగా అపరిచితుల నుండి వస్తాయని కనుగొన్నారు. ఈ కాల్స్‌లో 4% మాత్రమే తెలిసిన పరిచయస్తుల నుండి వేధింపుల కాల్స్ వస్తున్నట్లు తేలింది. మహిళలు తమ ఫోన్ నంబర్లను రీఛార్జ్ స్టోర్లు, రెస్టారెంట్లు, షాపింగ్ చేసేటప్పుడు, పోటీల్లోకి ప్రవేశించడం మరియు లాగ్‌బుక్‌లను నింపడం వంటి కొన్ని ప్రాంతాలలో వాడడం ద్వారా ఇటువంటి వేధింపుల కాల్స్ సమస్యను ఎదుర్కుంటున్నారు.

 

 

ఆన్‌లైన్‌ ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడం ఎలా?ఆన్‌లైన్‌ ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడం ఎలా?

మహిళల భావనలు

మహిళల భావనలు

వేధింపుల కాల్స్ విషయానికి వస్తే మెట్రో నగరాల్లోని మహిళలు ఎక్కువగా ఇటువంటి సమస్యలకు ప్రభావితమవుతున్నారు. ఈ జాబితాలో చెన్నై నగరం మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో న్యూ డిల్లీ, పూణే మరియు కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఈ నివేదికలో హైలైట్ చేయబడిన మరో ఆసక్తికరమైన ధోరణి ఏమిటంటే ఈ కాల్‌లను నివేదించేటప్పుడు మహిళలు ఎలా భావించారు అని. ఇండియాలో 67% మంది మహిళలు ఈ కాల్‌లతో చికాకుగా భావించారు. 60% మంది కోపంగా ఫీల్ అవ్వగా వారిలో 29% మంది ఆందోళనకు గురి అయ్యారు, 29% మంది ఇబ్బంది పడగా మరొక 21% మంది భయపడుతున్నారని ట్రూకాలర్ తన నివేదికలో చెప్పారు.

ఇతర దేశాలలో ట్రూకాలర్  సర్వే

ఇతర దేశాలలో ట్రూకాలర్ సర్వే

కెన్యా, కొలంబియా, బ్రెజిల్ మరియు ఈజిప్టులలో కూడా ట్రూకాలర్ తన సర్వేను నిర్వహించింది. ట్రూకాలర్ ఈ సర్వేను స్వతంత్ర మార్కెట్ పరిశోధన సంస్థ ఇప్సోస్‌తో నిర్వహించారు.

 

 

Best Mobiles in India

English summary
Truecaller Survey: Indian Womens Facing Most Sexual Harassment Calls

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X