ఐఓఎస్ యూజర్ల కోసం ట్రూకాలర్‌లోకి కాల్ వెయింటింగ్ ఫీచర్

By Gizbot Bureau
|

ట్రూకాలర్ వాయిస్ తన ప్రీమియం చందాదారుల కోసం VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) కాలింగ్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ విదితమే. ఈ కాింగ్ ఫీచర్ ఇప్పుడు సరికొత్త అప్ డేట్ ని తీసుకువచ్చింది. అదే కాల్ వెయిటింగ్ ఫీచర్. ఈ కొత్త అప్ డేట్ ప్రధాన ఉద్దేశం యూజర్లకు interruption-free కాలింగ్ సపోర్ట్ ను అందజేయడమే. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. కాగా ఇంతకుముందే ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ట్రూకాలర్ యాప్ వాడుతున్న వారు మొబైల్ నెట్ కాని లేకుంటే వైఫై ద్వారా కాని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ కాల్ ఫీచర్ ను వాట్సప్ , స్కైప్ లకు పోటీగా ట్రూకాలర్ యాప్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కాల్ మాట్లాడుతున్నప్పుడు సెకండ్ కాల్ రాగానే అది వెయిటింగ్ లిస్టులో చూపిస్తుంది. మీరు కరెంట్ కాల్ ఆటో పౌసింగ్ చేయకుండానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాల్ వెయిట్ స్టేటస్ పై మీకు వెంటనే సమాచారం అందిస్తుంది.

సెకండ్ కాల్ కి కనెక్ట్ 
 

సెకండ్ కాల్ కి కనెక్ట్ 

ఈ కాల్ వెయింటిగ్ ఫీచర్ ద్వారా మీరు ఫస్ట్ కాల్ మాట్లాడుతున్న సమయంలో వెంటనే సెకండ్ కాల్ కి కనెక్ట్ కావచ్చు. అది మీ చేతుల్లోనే ఉండే విధంగా ట్రూకాలర్ యాప్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఫోన్ కి VoIP calls రెండింటిలో సజావుగా పనిచేయడానికి తయారుచేయబడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వాయిస్ స్పామ్ VoIP కాల్‌

వాయిస్ స్పామ్ VoIP కాల్‌

కాల్ వెయిటింగ్ ఫీచర్‌తో పాటు, ఆధునికరించబడిన న ట్రూకాలర్ వాయిస్‌లో ట్రూకాలర్ ప్లాట్‌ఫాం యొక్క ఐకానిక్ కాలర్ ఐడి ఫీచర్ ఉంది. ఇది తెలియని నంబర్ల నుంచి వచ్చే వాయిస్ స్పామ్ VoIP కాల్స్ ను గుర్తించడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. కాగా కాల్ వెయిటింగ్ ఫీచర్‌తో పాటు కాలర్ ఐడి ఫీచర్ వినియోగదారులు రెండవ కాల్‌కు హాజరు కావాలా లేదా ప్రస్తుత కాల్‌తో కొనసాగాలా అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరణ

ప్రపంచవ్యాప్తంగా విస్తరణ

iOS వినియోగదారులందరికీ ట్రూకాలర్ వాయిస్‌ను విడుదల చేయడం ద్వారా ట్రూకాలర్ తన VoIP సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లయింది . జూన్లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ సేవను ట్రూకాలర్ యాప్ ప్రారంభించబడింది.

ట్రూకాలర్ లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్
 

ట్రూకాలర్ లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్

  • ట్రూకాలర్‌ పే - ట్రూకాలర్‌ ఆప్‌ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, అందుకోవచ్చు. ట్రూకాలర్‌ పే పేరుతో ఓ సర్వీసును ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఆప్‌లోని ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఓ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ, భీమ్‌ ఆప్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబరుకు డబ్బులు పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ ఆప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జిలూ చేసుకోవచ్చు.
  • ట్రూకాలర్‌ ఎస్‌ఎంఎస్ - మీ మొబైల్‌లోని మెసేజ్‌ ఇన్‌బాక్స్‌ను పూర్తిగా యాక్సెస్‌ చేయగలిగేలా ట్రూకాలర్‌ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల మెసేజ్‌లు పంపించే విధానం, స్పామ్‌ ఎస్‌ఎంఎస్‌లు గుర్తించే విధానం మరింత సులభతరమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మెసేజ్‌లు (ప్రీ డిఫైన్డ్‌ మెసేజ్‌లు) పంపించుకునే సౌలభ్యమూ అందుబాటులోకి వచ్చింది.
  • ఎయిర్‌టెల్‌ ట్రూకాలర్‌ ఐడీ - ఎవరు కాల్‌ చేస్తున్నారో ట్రూకాలర్‌ ద్వారా తెలుసుకోవాలంటే కచ్చితంగా నెట్‌ ఉండాల్సిందే. అంతర్జాలం లేనివాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా ఎయిర్‌టెల్‌తో కలసి ట్రూకాలర్‌ కొత్తగా ‘ఎయిర్‌టెల్‌ ట్రూకాలర్‌ ఐడీ' ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మీకు ఎయిర్‌టెల్‌ నెంబరు నుంచి కాల్‌ వస్తే అప్పుడు నెట్‌ వినియోగించకపోయినా ఆ వ్యక్తి వివరాలు ట్రూకాలర్‌ ఆప్‌లో కనిపిస్తాయి. త్వరలో వచ్చే అవకాశం ఉంది.
  • చెక్ లాస్ట్ సీన్ - కాంటాక్ట్ పక్కన ఉండే సమాచారం ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అక్కడే ఉండే కాంటాక్ట్స్ పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం అంతా అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి ఆన్ లైన్లో ఉన్నాడా.. లాస్ట్ సీన్ స్టేటస్ లను కూడా చెక్ చేయవచ్చు.
  • మీ అనంబర్ అన్ లిస్ట్ - మీ నంబర్ ట్రూ కాలర్లో కనిపించడం ఇష్టం లేదా...అయితే మీరు https://www.truecaller.com/unilistingను విజిట్ చేసి మీ ఫోన్ నంబర్ ను కంట్రీ కోడ్ తో సహా టైపు చేసి అన్ లిస్ట్షోన్ నంబరును సెలక్ట్ చేసుకుంటే చాలు. అయితే ఇకపై మీ ఫోన్లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసి ఉండకూడదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Truecaller Voice Gets Integrated Call Waiting Feature, Reaches iOS Users Globally

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X