Truecaller Web ట్రూకాలర్ వెబ్ సర్వీసుల గురించి తెలుసా.. ఎలా పనిచేస్తుంది.. పూర్తి వివరాలు..!
ట్రూకాలర్... తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, మెసెజ్‌లు వచ్చినప్పుడు వారి వివరాలు తెలుసుకోవడం సహా స్పామ్ బ్లాకర్‌గా అనేక మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే తాజాగా ట్రూకాలర్ వెబ్ సర్వీసులు (Truecaller for web) అందుబాటులోకి వచ్చాయి. మరింత సౌకర్యవంతంగా మరియు భద్రతను అందించేందుకు ఈ సర్వీసులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే ట్రూకాలర్ వెబ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మరియు అన్ని విండోస్, Mac బ్రౌజర్లలోనూ ట్రూకాలర్ వెబ్ పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా మెసెజ్‌లను పంపడం, రిసీవ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఫోన్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది.

100MB డేటా బదిలీ చేసుకోవచ్చు : ఫోన్ నంబర్‌ను లింక్ చేశాక.. ట్రూకాలర్ వినియోగదారుల బిజినెస్ మెసెజ్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు, SMS మెసేజ్‌లను చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు 100MB వరకు డేటాను బదిలీ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇన్‌కమింగ్ కాల్, మెసెజ్‌ల నోటిఫికేషన్లను పొందవచ్చు.
దీంతోపాటు ట్రూకాలర్ కీలక వివరాలను వెల్లడించింది. మొబైల్ యాప్ తరహాలో ఎటువంటి మెసేజ్‌ల యాక్సెస్ ట్రూకాలర్ కలిగి ఉండదని తెలిపింది. మరియు డెస్క్‌టాప్ వెర్షన్ మెరుగైన భద్రతను కలిగి ఉంటుందని ట్రూకాలర్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మరియు ఎండీ రిషిత్ తెలిపారు.
ఎలా వినియోగించుకోవాలి..
ప్రస్తుతం ట్రూకాలర్ వెబ్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లు తమ ట్రూకాలర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మెసెజెస్ ట్యాబ్ పైన ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి, మెసేజింగ్ ఫర్ వెబ్ ను ఎంచుకోవాలి. అనంతరం ఏదైనా బ్రౌజర్‌లో www.truecaller.com లోకి వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.
*అయితే ఇటీవల గూగుల్ కూడా ట్రూకాలర్ తరహా సేవలు అందించే విధంగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త టూల్ గూగుల్ లుక్‌అప్ (Google LookUp) ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్ 127.0.620688474 లో మాత్రమే అందుబాటులో ఉంది.
అయితే ఈ గూగుల్ Lookup టూల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని వివరాలు వెల్లడి కాలేదు. జూన్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ గూగుల్ కొత్త టూల్ అందుబాటులోకి వస్తే ట్రూకాలర్ యాప్ పై భారీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ట్రూకాలర్ క్లౌడ్ సోర్స్ ఆధారిత వివరాలను అందిస్తోంది. గూగుల్ కొత్త టూల్ దేని ఆధారంగా కాలర్ వివరాలను వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.
*ఫిబ్రవరిల 2024 లో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఎవరు ఫోన్ చేసిన వారి పేరు మొబైల్ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సప్లిమెంటరీ సర్వీసులను (CNAP) అన్ని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ సిఫార్సు చేసింది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకున్న వారి పేర్లు మాత్రమే వారు కాలింగ్ చేసినప్పుడు డిస్‌ప్లే పైన కనిపిస్తున్నాయి. థర్ట్ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నట్లయితే క్లౌడ్ సోర్స్ ఆధారిత వివరాలు కనిపిస్తున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ సిఫార్సులు అమల్లోకి వస్తే ఎవరూ ఫోన్ చేసినా వారి వివరాలు వెల్లడి అవుతాయి. కొత్త సిమ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు కస్టమర్ అప్లికేషన్ ఫాంలో నమోదు చేసిన వివరాలు మాత్రమే ఫోన్ చేసినప్పుడు కనిపిస్తాయి.
ఇప్పటికే ట్రూ కాలర్, భారత్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి సంస్థలు క్లౌడ్ సోర్స్ డేటా ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాయి. అంటే మీ నంబర్‌ను ఇతరులు ఎలా సేవ్ చేసుకుంటే ఆ పేరునే ఈ సంస్థలు డిస్‌ప్లేపైన కనిపించేలా చేస్తున్నాయి. ఇలాంటి సర్వీసులను పూర్తిస్థాయిలో విశ్వసించలేమని ట్రాయ్ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications