Truecaller లో 'కాల్ రీజన్' కొత్త ఫీచర్!!! ఓ లుక్ వేయండి...

|

ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ కాల్‌లను గుర్తించడానికి మరియు నిరోధించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తన ప్లాట్‌ఫామ్‌లోకి తాజాగా అదనంగా కాల్ రీజన్ అనే కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ఇది ట్రూకాలర్‌తో ఎవరైనా వారిని ఎందుకు కాల్ చేస్తున్నారో వినియోగదారులకు తెలియజేస్తుందని కంపెనీ తెలిపింది.

ట్రూకాలర్ కాల్ రీజన్ ఫీచర్

ట్రూకాలర్ కాల్ రీజన్ ఫీచర్

ట్రూకాలర్ యొక్క కాల్ రీజన్ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని ట్రూకాలర్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్ దాని వెర్షన్ 11.30 అప్ డేట్ లో భాగంగా రోలింగ్ చేయబడుతుందని తెలిపింది. అంతేకాకుండా ఇన్-యాప్, ఆన్-డివైస్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను జోడించడం ద్వారా కంపెనీ తన మెసేజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచిందని ట్రూకాలర్ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: మొబైల్ గేమర్స్ ఏ నగరంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా????Also Read: మొబైల్ గేమర్స్ ఏ నగరంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా????

ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో కాల్ రీజన్ ఫీచర్‌

ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో కాల్ రీజన్ ఫీచర్‌

ట్రూకాలర్ ప్లాట్‌ఫామ్‌లోని వినియోగదారులు ఇంతకు ముందు తమకు ‘ఎవరు' కాల్‌ చేస్తున్నారో గుర్తించటానికి వీలు కల్పించింది. కానీ ఇప్పుడు తన ప్లాట్‌ఫాంలో తాజా చేరికతో ‘ఎందుకు' కాల్ చేస్తున్నారో అన్న ప్రశ్నను కూడా పరిష్కరిస్తోందని కంపెనీ తెలిపింది. "ప్రజలు ఎందుకు కాల్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారని చాలా ట్వీట్లు మరియు సందేశాలను మేము తరచూ చూస్తున్నాము. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ గొప్ప ఆలోచనను సాధించాము "అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ట్రూకాలర్ కాల్ రీజన్ ఫీచర్ ఉపయోగాలు

ట్రూకాలర్ కాల్ రీజన్ ఫీచర్ ఉపయోగాలు

ఎమర్జెన్సీ కాల్, వ్యక్తిగత లేదా బిజినెస్ వంటి అని వినియోగదారులకు అర్థమయ్యేలా కాల్ రీజన్ ఫీచర్ సహాయపడుతుందని ట్రూకాలర్ తెలిపింది. వినియోగదారులు కాల్ రీజన్ ను ఎక్కువగా ఉపయోగించడానికి మూడు అనుకూల కారణాలను సెట్ చేయవచ్చని ప్రత్యేకంగా తెలిపింది. అదనంగా ట్రూకాలర్ దాని వినియోగదారులు తెలిపే ప్రతిఒక కారణం పూర్తిగా రాయడానికి కూడా అనుమతిని ఇస్తుంది.

iOS 14 అప్ డేట్ లో కొత్త మెరుగుదలతో ట్రూకాలర్

iOS 14 అప్ డేట్ లో కొత్త మెరుగుదలతో ట్రూకాలర్

IOS ప్లాట్‌ఫామ్ లో ట్రూకాలర్ యొక్క కొత్త అప్ డేట్ 2021 ప్రారంభంలో ప్రవేశపెట్టబడుతుందని నివేదించబడింది. ముఖ్యంగా ట్రూకాలర్ ఒక ట్వీట్‌లో iOS పై "సాంకేతిక పరిమితులు" ఫలితంగా దాని యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. అయితే iOS 14 తో కాలర్ ID తో సహా రాబోయే సంస్కరణలో చాలా మెరుగుదలలు చూడవచ్చు అని కంపెనీ ట్వీట్‌లో తెలిపింది.

Best Mobiles in India

English summary
Truecaller 'why someone is calling you' New Feature Unveils

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X