USలో కూడా TikTok, WeChat యాప్ బ్యాన్!! చైనాకు ఝలక్ ఇచ్చిన ట్రంప్...
చైనా యాజమాన్యంలో పనిచేస్తున్న సోషల్ మీడియా యాప్స్ వీచాట్, టిక్‌టాక్‌లను ఇప్పుడు అమెరికాలో కూడా బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క గవర్నమెంట్ లోని వాణిజ్య విభాగం ప్రకటించింది. అలాగే వీటి యొక్క డౌన్ లోడ్ లు సెప్టెంబర్ 20 నుండి పూర్తిగా నిషేధించనున్నట్లు ప్రత్యేకంగా ప్రకటించింది. US వాణిజ్య విభాగం నుండి వచ్చిన ఈ క్రొత్త ప్రకటనతో సెప్టెంబర్ 20 తర్వాత టిక్‌టాక్ లేదా వీచాట్ గూగుల్ యొక్క ప్లే స్టోర్ మరియు ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉండవు. దీని గురించి మరిన్ని వివరాలు తీసుకోవడానికి ముందుకు చదవండి.

టిక్‌టాక్‌తో ఒరాకిల్ ఒప్పందం
US టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయగలదా అనే ప్రశ్న తలెత్తిన సమయంలో అమెరికా ప్రభుత్వం ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ కొత్త ప్రకటన ఒరాకిల్‌తో ఒప్పందం ఇంకా కొనసాగగలదా అని స్పష్టం చేయలేదు. ఆ నిర్ణయానికి గడువు రేపటి వరకు మాత్రమే అంటే సెప్టెంబర్ 20 వరకే. టిక్ టాక్ ఒక అమెరికన్ కంపెనీ యాజమాన్యంలో ఉండాలనే మునుపటి ఉద్దేశ్యాన్ని అమలు చేయడానికి ఇది ట్రంప్ పరిపాలన యొక్క బలమైన చర్య అని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

USలో టెన్సెంట్ సంస్థ మనుగడ
డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభుత్వం తన మునుపటి ఉత్తర్వులో టిక్‌టాక్ యొక్క వ్యాపారం దేశంలో కొనసాగడానికి యుఎస్‌లోని ఒక సంస్థకు విక్రయించడానికి 45 రోజుల సమయం ఇచ్చారు. ఈ ఆర్డర్‌లో ప్రముఖ చైనా కంపెనీ టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ కూడా ఉంది. వీచాట్‌ను నిషేధించడం అనేది దాని మాతృ సంస్థ టెన్సెంట్ కు క్యాస్కేడింగ్ ఫలితాన్ని ఇస్తుంది. ఇది వీచాట్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా మొబైల్ గేమ్లను కూడా టెన్సెంట్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ గేమ్ లలో PUBG మొబైల్ మరియు కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటివి కూడా ఉన్నాయి. ఇది ఈ రెండు ప్రసిద్ధ గేమ్ లను కూడా నిషేధించటానికి దారితీస్తుంది. టెన్సెంట్ గేమ్స్ దీనిపై ఇంకా ఒక ప్రకటన చేయలేదు.

ఇండియాలో చైనా యాప్ లు బ్యాన్
ఇండియాలో గత నెలలో చైనా యొక్క 108 యాప్ లు బ్యాన్ చేసారు. వినియోగదారుల యొక్క డేటాను లీక్ చేస్తున్న కారణంగా మరియు మరికొన్ని ఇతర కారణాల దృష్ట్యా వీటిని బ్యాన్ చేసారు. ఇందులో టిక్‌టాక్‌తో సహా PUBG మొబైల్ గేమ్ వంటివి కూడా ఉన్నాయి. వీటిలో ప్రతి దానికి ప్రత్యాన్మాయంగా కొన్ని యాప్ లను సొంతంగా ఇప్పటికే విడుదల చేసారు.


Click it and Unblock the Notifications