Home
News

ChatGPTతో మీ ఫొటోలను స్టూడియో-క్వాలిటీ పోర్ట్రెయిట్లుగా మార్చడం ఎలా..?

ఇకపై ఖరీదైన కెమెరాలు లేదా ఫ్యాన్సీ లైటింగ్ సెటప్‌లు లేకుండానే అద్భుతమైన స్టూడియో-క్వాలిటీ పోర్ట్రెయిట్‌లను మీరు కూడా పొందవచ్చు. కేవలం ఒకే ఒక్క వివరమైన ప్రాంప్ట్‌తో, ChatGPT ఇమేజ్ జనరేషన్ టూల్ మీ సాధారణ ఫొటోలను అబ్బురపరిచే, హై-రిజల్యూషన్ పోర్ట్రెయిట్‌లుగా మార్చేస్తుంది. ఇటీవల వచ్చిన అప్‌గ్రేడ్స్ పుణ్యమా అని, చాట్‌జీపీటీ ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసినట్లుగా ఉండే పోర్ట్రెయిట్లను సృష్టించగలదు.

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ @ruiz.acosta షేర్ చేసిన ఒక బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ దీనికి ఒక వైరల్ ఉదాహరణ. ఇది పూర్తిగా ChatGPT ఉపయోగించి క్రియేట్ చేశారు, చూడటానికి చాలా షార్ప్‌గా, డ్రమటిక్‌గా, నిజమైన ఫొటోలాగే ఉంది. ఈ AI పోర్ట్రెయిట్స్ ఇంత ఆకట్టుకునేలా ఉండటానికి కారణం, అవి ఇప్పుడు ఎన్నో సూక్ష్మమైన వివరాలను కూడా అర్థం చేసుకోగలగడమే.

Turn Ordinary Photos into Studio-Quality Portraits Using ChatGPT

* అన్నీ నేర్చుకుంది : చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ కేవలం ఇమేజ్ క్వాలిటీలోనే కాకుండా, కెమెరా యాంగిల్స్, లైటింగ్, లెన్స్ రకాలు, ఆర్టిస్టిక్ స్టైల్స్‌ను అర్థం చేసుకునే విషయంలోనూ మరింత స్మార్ట్‌గా తయారైంది. ఇది కేవలం సాధారణ బొమ్మలు గీయడం కాదు. ఇప్పుడు ప్రొఫెషనల్ స్టూడియో లైటింగ్, ఫిల్మ్-స్టైల్ లెన్స్‌లు, లేదా కాన్సెప్ట్ ఆర్ట్‌ను కూడా అనుకరించేలా చిత్రాలను జనరేట్ చేయవచ్చు.

ఈ టూల్ మీ ముఖంపై నీటి బిందువులు, బ్యాక్‌గ్రౌండ్‌లో పొగమంచు, లేదా మీ బుగ్గలపై సున్నితమైన లైటింగ్ ఎఫెక్ట్స్ వంటివాటిని కూడా సృష్టించగలదు. ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోగలదు. ఈ స్థాయి కంట్రోల్, సాధారణ యూజర్లకు కూడా ఒక డిజిటల్ ఆర్ట్ స్టూడియో శక్తిని అందిస్తుంది.

సరైన ప్రాంప్ట్ ఎందుకంత ముఖ్యం : మీరు ఇచ్చే ఇంగ్లీష్ ప్రాంప్ట్‌పైనే మీ ఇమేజ్ ఔట్‌పుట్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఓ పవర్‌ఫుల్ ప్రాంప్ట్ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. అదేంటంటే.. "టాప్-యాంగిల్‌ క్లోజప్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ ఆఫ్ మై ఫేస్, హెడ్ ఫేసింగ్ ఫార్వర్డ్. 35mm లెన్స్ ఎఫెక్ట్, 10.7K 4HD క్వాలిటీ, గర్వంగా ఉండే ఎక్స్‌ప్రెషన్, ముఖంపై నీటి బిందువులు. డీప్ బ్లాక్ షాడో బ్యాక్‌గ్రౌండ్, ముఖం మాత్రమే కనిపించాలి, అల్ట్రా-షార్ప్. 4:3 రేషియో, 1/5 ప్రాసెసింగ్ డెప్త్ ఎఫెక్ట్." ఇలా ఇంగ్లీష్‌లోనే డీటెయిల్స్ రాయాలి.

ఇక్కడ స్పష్టమైన వివరణ ఉండటమే సక్సెస్ సీక్రెట్. ఇది AIకి సరిగ్గా ఏమి సృష్టించాలో చెబుతుంది. ఇందులో కెమెరా పర్‌స్పెక్టివ్, ముఖ కవళికలు, లెన్స్ రకం, లైటింగ్ సెటప్, ఇమేజ్ క్వాలిటీ వంటి వివరాలున్నాయి. దీని ఫలితం ఒక ప్రొఫెషనల్ బ్లాక్ అండ్ వైట్ మ్యాగజైన్ పోర్ట్రెయిట్‌లా కనిపిస్తుంది.

నిజానికి చాలా సింపుల్ స్టెప్స్‌లో మీ పోర్ట్రెయిట్ రెడీ అవుతుంది. అందుకు మీరు ముందుగా ChatGPTకి లాగిన్ అవ్వాలి. మీకు నచ్చిన ఫోటోను అప్‌లోడ్ చేయాలి. మీకు కావలసిన పోర్ట్రెయిట్ స్టైల్‌ను వివరిస్తూ డీటెయిల్డ్ ప్రాంప్ట్‌ను ఎంటర్ చేయాలి

* ఇవిగో కొన్ని శాంపిల్ ప్రాంప్ట్‌లు..

ప్రాంప్ట్ 1 : "డ్రమటిక్ లో-యాంగిల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్, కాన్ఫిడెంట్ ఎక్స్‌ప్రెషన్. 50mm సినిమాటిక్ లెన్స్, 10K క్వాలిటీ, భుజాల చుట్టూ మృదువైన పొగమంచు, స్ట్రాంగ్ కాంట్రాస్ట్, ముఖం ఫోకస్‌లో ఉండాలి, 4:3 రేషియో." సేమ్ ఇలాగే ఇంగ్లీషులో ప్రాంప్ట్ రాస్తే సరిపోతుంది.

ప్రాంప్ట్ 2: "మూడీ బ్లాక్ అండ్ వైట్ సైడ్ ప్రొఫైల్, షార్ప్ ఫేషియల్ టెక్స్‌చర్. 24mm లెన్స్ లుక్, 4K రిజల్యూషన్, చర్మంపై తేలికపాటి వర్షం, మెరుస్తున్న ఎఫెక్ట్, మృదువైన నీడలు, మ్యాట్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్, ఆలోచనాత్మకమైన ఎక్స్‌ప్రెషన్. 3:2 రేషియో." ఈ ప్రాంత కూడా చాలా మంచి ఔట్‌ఫుట్ అందిస్తుంది.

ప్రాంప్ట్ 3: "హై-కాంట్రాస్ట్ క్లోజప్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్, 85mm వర్చువల్ లెన్స్, 8K రిజల్యూషన్, ముఖంపై డైరెక్ట్ సాఫ్ట్ లైట్, బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్ స్మోక్, షార్ప్ ఫేషియల్ డీటెయిల్స్. 1:1 యాస్పెక్ట్ రేషియో." ఈ ప్రాంప్ట్‌లలో ప్రతిదీ, సింపుల్ కానీ నిర్దిష్టమైన వివరణలతో AIని ఎలా గైడ్ చేయాలో చూపిస్తుంది.

మీ ముఖానికి, మూడ్‌కు, లేదా బ్యాక్‌గ్రౌండ్ స్టైల్‌కు సరిపోయేలా వీటిని మార్చుకోవచ్చు. చాట్‌జీపీటీ అడ్వాన్స్‌డ్ ఇమేజ్ టూల్స్‌తో, మీ పర్సనల్ పోర్ట్రెయిట్స్ ఇప్పుడు ఫ్యాషన్ మ్యాగజైన్ లేదా సినిమా పోస్టర్ నుండి వచ్చినట్లుగా కనిపించవచ్చు, అదీ ఎలాంటి స్టూడియో అవసరం లేకుండానే.

Best Mobiles in India

English summary
Turn Ordinary Photos into Studio-Quality Portraits Using ChatGPT’s AI Tool in Just 3 Steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X