Home
News

టీవీ స్లో అయిందా.. ఈ సింపుల్ ట్రిక్‌తో సూపర్ స్పీడ్‌తో పనిచేస్తుంది..!

Clear TV Cache: స్మార్ట్ టీవీలు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. వాటిల్లో సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం, పాటలు వినడం.. ఇలా చాలా పనులు చేస్తుంటాం. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల లాగే స్మార్ట్ టీవీలు కూడా 'క్యాచీ (Cache)' అనే టెంపరరీ ఫైల్స్‌ను స్టోర్ చేసుకుంటాయి. ఈ ఫైల్స్ యాప్స్ స్మూత్‌గా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు ఇవే ఎక్కువైపోయి టీవీ స్లో అవ్వడానికి కారణమవుతాయి.

అప్పుడప్పుడు యాప్స్ క్రాష్ అవ్వడం, టీవీ ఫ్రీజ్ అవ్వడం, స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రావడం వంటివి జరుగుతుంటాయి. అందుకే క్యాచీ క్లియర్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ టీవీని మళ్లీ కొత్త దానిలా ఫాస్ట్‌గా మార్చేస్తుంది. క్యాచీ క్లియర్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేవో చూద్దాం.

TV Trouble Clear the Cache  Simple Steps to Boost Performance on Sony  Samsung  and More

* ఉపయోగాలు

క్యాచీ క్లియర్ చేస్తే మీ టీవీ చాలా వేగంగా పనిచేస్తుంది. రిమోట్ బటన్ నొక్కితే వెంటనే రియాక్ట్ అవుతుంది. యాప్స్ కూడా చకచకా ఓపెన్ అవుతాయి. యాప్స్ మధ్యలో ఆగిపోవడం, క్రాష్ అవ్వడం వంటి సమస్యలు తగ్గుతాయి. టీవీ మళ్లీ సక్రమంగా పనిచేయడం మొదలుపెడుతుంది.

పాత ఫైల్స్ తొలగిపోవడం వల్ల టీవీలో ఖాళీ స్పేస్ పెరుగుతుంది. కొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం. ఖాళీ స్పేస్ లేకపోతే టీవీ చాలా స్లో అయిపోతుంది ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుంది. అందుకే క్యాచీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.

* టీవీ బ్రాండ్‌ను బట్టి ఎలా క్లియర్ చేయాలి

1. శామ్‌సంగ్ టీవీ: ఈ టీవీలలో క్యాచీ క్లియర్ చేయాలో చాలా ఈజీ. ముందుగా శామ్‌సంగ్ టీవీ రిమోట్‌లో హోమ్ బటన్‌పై నొక్కాలి. మెనూ ఓపెన్ అవుతుంది. "సెట్టింగ్స్" ఆప్షన్‌కు వెళ్లాలి. ఇది గేర్ ఐకాన్ లాగా ఉంటుంది. సెట్టింగ్స్‌లో "సపోర్ట్" ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.

సపోర్ట్‌లో "డివైజ్‌ కేర్" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డివైజ్‌ కేర్‌లో "మేనేజ్ స్టోరేజ్" ఆప్షన్‌కు వెళ్లాలి. ఇక్కడ టీవీ స్టోరేజ్ కనిపిస్తుంది. క్యాచీ క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను హైలైట్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ చేయాలి.

యాప్ సెలెక్ట్ చేశాక "వ్యూ డీటెయిల్స్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. వ్యూ డీటెయిల్స్‌లో "క్లియర్ క్యాచీ"పై నొక్కాలి, అంతే, ఆ యాప్ క్యాచీ క్లియర్ అయిపోతుంది. కావాలంటే మిగతా యాప్స్‌కు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. తద్వారా టీవీ పర్ఫామెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

2. LG టీవీ: ఈ టీవీలలో క్యాచీ క్లియర్ చేయడానికి ముందుగా LG టీవీ రిమోట్‌లో సెట్టింగ్స్ బటన్ నొక్కండి. ఇది గేర్ సింబల్ లాగా ఉంటుంది. సెట్టింగ్స్‌లో "ఆల్ సెట్టింగ్స్" ఆప్షన్‌కు వెళ్లాలి. "ఆల్ సెట్టింగ్స్‌"లో జనరల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్‌లో సిస్టమ్ అనే ఆప్షన్‌కు వెళ్లాలి.

సిస్టమ్‌లో "క్లియర్ క్యాచీ" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాచీ క్లియర్ చేయాలా వద్దా అని టీవీ మిమ్మల్ని అడుగుతుంది. "ఓకే" బటన్ నొక్కి కన్ఫర్మ్ చేయాలి. క్యాచీ క్లియర్ అయిపోయాక టీవీని ఒక్కసారి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే టీవీ ఇంకా స్మూత్‌గా పనిచేస్తుంది.

3. సోనీ (Android/Google) టీవీ: ఈ టీవీలలో క్యాచీ క్లియర్ చేయడానికి.. సోనీ టీవీలో "సెట్టింగ్స్" మెనూ ఓపెన్ చేయాలి. ఇది గేర్ ఐకాన్ లాగా ఉంటుంది. సెట్టింగ్స్‌లో యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. యాప్స్‌లో "సీ ఆల్ యాప్స్" ఆప్షన్‌కు వెళ్లాలి. ఇక్కడ టీవీలో ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి.

మీకు ప్రాబ్లమ్ ఇస్తున్న యాప్‌ను సెలెక్ట్ చేయాలి. అంటే ఏ యాప్ అయితే సరిగ్గా పనిచేయట్లేదో ఆ యాప్‌ను ఎంచుకోవాలి. ఆపై యాప్ ఇన్ఫో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ "స్టోరేజ్" ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టోరేజ్ ఆప్షన్‌లో "క్లియర్ క్యాచీ" అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కండి. అంతే, ఆ యాప్ క్యాచీ క్లియర్ అవుతుంది.

4. గూగుల్ టీవీ: గూగుల్ టీవీలో సెట్టింగ్స్ మెనూ ఓపెన్ చేయాలి. "సెట్టింగ్స్‌"లో యాప్స్ ఆప్షన్‌కు వెళ్లాలి. యాప్స్‌లో "యువర్ యాప్స్" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీవీలో ఉన్న యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీరు క్యాచీ క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోవాలి.

యాప్ సెలెక్ట్ చేశాక "క్లియర్ క్యాచీ" ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కాలి. టీవీని రీస్టార్ట్ చేస్తే ఇంకా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కావాలంటే మిగతా యాప్స్‌కు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. తద్వారా టీవీ పర్ఫామెన్స్ చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు.

* క్యాచీ ఎప్పుడు క్లియర్ చేయాలి

టీవీ స్లో అవుతున్నట్లు అనిపించినా, లేకపోయినా కొన్ని నెలలకు ఒకసారి కాష్ క్లియర్ చేస్తూ ఉండండి. టీవీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత కాష్ క్లియర్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడు టీవీ ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే రోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా మీ టీవీని రీస్టార్ట్ చేయాలి.

రీస్టార్ట్ చేస్తే టెంపరరీ మెమరీ క్లియర్ అవుతుంది, చిన్న చిన్న సమస్యలు పోతాయి, టీవీ స్మూత్‌గా పనిచేస్తుంది. రీస్టార్ట్ చేయడానికి రిమోట్‌తో టీవీ ఆఫ్ చేసి, పవర్ ప్లగ్ తీసేసి 1-2 నిమిషాలు ఆగి మళ్లీ పెట్టండి. పర్ఫామెన్స్ ఇంప్రూవ్ చేయడానికి టీవీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తుండాలి.

అప్‌డేట్స్ వల్ల కొత్త ఫీచర్స్ వస్తాయి, సెక్యూరిటీ కూడా బాగుంటుంది. వాడని యాప్స్ చాలా ఉంటే వాటిని డిలీట్ చేసేయాలి. వాటి వల్ల స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, టీవీ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. వెంటనే కొత్త టీవీకి అప్‌గ్రేడ్ కాకుండా, ఈ సింపుల్ టిప్స్ పాటించడం మంచిది.

More from GizBot

Best Mobiles in India

English summary
Clear your smart TV cache regularly to boost performance, fix slowdowns, and free up storage. Learn easy steps for Samsung, LG, Sony, and Google TVs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X