వెబ్‌లో ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న ట్విట్టర్ పక్షి

Posted By: Staff

వెబ్‌లో ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న ట్విట్టర్ పక్షి

శాన్ఫ్రాన్సికో: ఇప్పుడు మనం పార్టీ చేసుకొవాల్సిన సమయం వచ్చింది. అందుకు కారణం మన ఫేవరేట్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ జులై 16న ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. 2006వ సంవత్సరంలో జులై 15న ట్విట్టర్ పుట్టింది. అలా తన పుట్టిన రోజు నాడే 224 ట్వీట్స్‌ని యూజర్స్‌కు పంపడం జరిగింది. ట్విట్టర్ పేరుతో తన సర్వీస్‌ని మొదలు పెట్టినటువంటి ట్విట్టర్ అనతి కాలంలోనే ఎంతో ఎత్తుకి ఎదిగింది. మొట్టమొదట రోజున పంపినటువంటి 224 ట్వీట్స్‌ని ఇప్పుడు పోల్చుకున్నట్లైతే ప్రతి సెకనులో పదోవంతు ట్వీట్స్ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా వెళుతున్నాయి.

ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ఉన్న యూజర్స్ రోజుకి దాదాపు సుమారుగా 350 బిలియన్ ట్వీట్స్‌ని పంపిస్తున్నారు. ఓ చిన్నమైక్రో బ్లాగింగ్ సైట్‌గా స్దాపించిన ట్విట్టర్ గడచిన ఈ ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్న సోషల్ ప్లాట్ ఫామ్ మీద ముఖ్య భూమికను పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాలలో నియంతల నిరంకుశత్వాన్ని ప్రజలకు తెలియజేసేటటువంటి ఓ మహా సాధనంగా ట్విట్టర్‌ని వాడడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల జపాన్ సునామీ సంభవించిన సమయంలో ట్విట్టర్ ఇన్పర్మేషన్‌ని చేరవేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడింది.

వీటితో పాటు ప్రపంచంలో జరిగేటటువంటి బ్రేకింగ్ న్యూస్‌ని ఎప్పటికప్పుడు మీముందు ఉంచే సాధనంగా ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన బాంబు దాడుల్లో గాయపడిన వారి సమాచారం అతి వేగంగా చేరవేయడంలో ట్విట్టర్ ఉపయోగపడిన విషయం తెలిసిందే. చాలా మంది ట్విట్టర్ యూజర్స్ హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ నెంబర్స్, ఫోన్ నెంబర్స్‌కు సంబందించిన వివరాలను ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot