రంగంలోకి దిగిన ట్విట్టర్ రెవెన్యూ ఇంజనీరింగ్ టీమ్‌... ఇక డబ్బే డబ్బు

Posted By: Super

రంగంలోకి దిగిన ట్విట్టర్ రెవెన్యూ ఇంజనీరింగ్ టీమ్‌... ఇక డబ్బే డబ్బు

ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో లాభాలబాటలో దూసుకుపోతున్న సాధనం ట్విట్టర్. అలాంటి ట్విట్టర్ గూగుల్‌లో ఎడ్వర్టైజింగ్ కాంపెయిన్‌కి సంబంధించినటువంటి ఓ చిన్న ఇంటర్నెట్ కంపెనీ యాడ్ గ్రోక్ టీమ్‌ని స్వాధీనం చేసుకుంది. ఇలా ఎడ్వర్టైజింగ్ కాంపెయిన్‌ టీమ్‌ని స్వాధీనం చేసుకోవడానికి కారణం మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయిన ట్విట్టర్ ఆదాయ వనరులను తెచ్చుకోవడానికేనని అన్నారు.

ఈ విషయాన్ని ఇంటర్నెట్ కంపెనీ యాడ్‌గ్రోక్ మంగళవారం ట్విట్టర్ తనని స్వాధన పరచుకున్న విషయం పత్రికా ప్రముఖంగా తెలియజేసింది. ట్విట్టర్ తనలో కలసి పనిచేయమని అడగగానే మేము అంగీకరించడం జరిగిందని కంపెనీ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం మేము చేస్తున్నటువంటి గూగుల్ యాడ్ వర్డ్స్ ప్లాట్ ఫామ్‌కి సంబంధించిన పనిని జూన్ చివరి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యాడ్ గ్రోక్ టీమ్ మాట్లాడుతూ ట్విట్టర్ మమ్మల్ని స్వాధీన పరచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నుండి మేము పుల్ టైమ్ ట్విట్టర్ రెవెన్యూ ఇంజనీరింగ్ టీమ్‌గా పని చేయనున్నామని తెలిపారు.

ఈ సందర్బంలో ట్విట్టర్ ప్రతినిధి మాట్ గ్రేవ్స్ మాట్లాడుతూ యాడ్ గ్రోక్ టీమ్‌కి సంబంధించిన టీమ్ మెంబర్స్ శాన్ ఫ్రానిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ హెడ్ క్యార్టర్స్ ఆఫీస్‌లో పనిచేయనున్నారని తెలిపారు. ఐతే ట్విట్టర్ యాడ్ గ్రోక్ టీమ్‌ని ఎంత డబ్బుకి స్వాధీనం చేసుకున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఓ టెక్నాలజీ బ్లాగ్ ప్రకారం $10మిలియన్‌లకు యాడ్ గ్రోక్ టీమ్‌‌ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇలా ట్విట్టర్ ఎడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కోసం సపరేట్‌‌గా ఓ టీమ్‌ని నెలకోల్పడానికి కారణం ఈ సంవత్సరం ట్విట్టర్ యాడ్ రెవిన్యూ టార్గెట్ $150మిలియన్లు రాబట్టాలనే ఉద్దేశ్యంతో రెవెన్యూ ఇంజనీరింగ్ టీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot