ఆండ్రాయిడ్ కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ కొత్త వర్సన్

Posted By: Super

ఆండ్రాయిడ్ కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ కొత్త వర్సన్

మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ఆండ్రాయిడ్ మొబైల్‌కి సంబంధించిన లేటెస్ట్ ట్విట్టర్ వర్సన్‌ని విడుదల చేసింది. దీని ద్వారా యూజర్స్‌కి మల్టీబుల్ ఎకౌంట్ సపోర్ట్, పుష్ నోటిఫికేషన్స్‌ని యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. దీని కోసం యూజర్స్ చేయాల్సిందల్లా ఎకౌంట్స్ సెట్టింగ్స్ లోకి వెళ్శి ఆటోమెటిక్ రిఫ్రెష్‌ని సెలక్ట్ చేసుకొవడమే. ఇలా చేయడంతో డైరెక్ట్ మెసెజ్‌లు పుష్ అప్ టేడ్స్‌గా వస్తాయి.

ఇది మాత్రమే కాకుండా మల్టిబుల్ ఎకౌంట్స్ , పుష్ నోటిఫికేషన్స్ అప్ టేడ్ అయిన తర్వాత కనిపించే స్క్రీన్‌ని కూడా ట్విట్టర్ పూర్తిగా మార్చివేసింది. ఇంకా దీని గురించి మీకు పూర్తి సమాచారం గనుక తెలుసుకొవాలనుకుంటే ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లస్(https://market.android.com) లోకి వెళ్శి ఆండ్రాయిడ్‌ని సపోర్ట్ చేసే కొత్త వర్సన్‌ని ఇనిస్టాల్ చేసుకొండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot