Just In
- 3 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 5 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 22 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- News
3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..
- Sports
పంత్ బాబు, ఊర్వశి పాప మధ్య తగ్గని రగడ.. ఇన్‌స్టా స్టోరీతో మళ్లీ చిచ్చు రాజేసిన పంత్..!
- Finance
Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షేర్.. దుస్తుల వ్యాపారంలో సంచలనం.. టార్గెట్ ధర ఎంతంటే..
- Movies
సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ట్రెడిషినల్, స్టైలిష్ లుక్స్ వైరల్
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Lifestyle
Relationship Mistakes: గాఢమైన బంధంలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు. జాగ్రత్త..!
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ Twitter కీలక చర్యలు తీసుకుంది. వేల సంఖ్యలో భారతలోని Twitter ఖాతాలను బ్యాన్ చేస్తూ చర్యలు తీసుకుంది. దాదాపు 46 వేలకు పైగా అకౌంట్లను నిషేధించింది. ఈ మేరకు Twitter స్వయంగా నెలవారీ కాంప్లియన్స్ నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 2022, మే నెలలో దాదాపు 46వేల Twitter ఖాతాలను తొలగించినట్లు అందులో పేర్కొంది. ఆ ఖాతాలు కంపెనీ మార్గదర్శకాలను పాటించడం లేదని, అందుకే నిషేధించినట్లు వెల్లడించింది.

Twitter రిపోర్ట్‌లో వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భారత్‌లో 2022, మే నెలలో ట్విటర్ కంపెనీ మార్గదర్శకాలను పాటించని దాదాపు 46 వేల ట్విటర్ ఖాతాలను కంపెనీ నిషేధించింది. వాటిల్లో 43,656 ఖాతాలు చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉల్లంఘనలకు సంబంధించినవి కాగా, మరో 2,870 ఖాతాలు టెర్రరిజం ను ప్రోత్సహించే పోస్టులు చేసిన ఆరోపణలతో వాటిపై నిషేధం విధించినట్లు కంపెనీ నివేదికలో పేర్కొంది.
"ట్విటర్ ప్లాట్‌ఫాంపై యూజర్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకునేందుకు కంపెనీ ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. కానీ, లైంగిక వేధింపులు, బెదిరింపులు, అమానవీయతకు సంబంధించిన పోస్ట్‌లను కంపెనీ ఎప్పటికీ ఉపేక్షించదు. అంతేకాకుండా డైరెక్టు మెసేజుల్లో కానీ, పబ్లిక్ ట్వీట్లలో గానీ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు సంబంధించిన పోస్టులను చేస్తే కంపెనీ ఏ మాత్రం సహించదు." అని ట్విటర్ నివేదిక పేర్కొంది.

ఫిర్యాదుల ప్రకారమే ఖాతాలపై నిషేధం:
భారత్‌లో 2022, ఏప్రిల్ 26 నుంచి మే 25 వ తేదీ వరకు పలు ట్విటర్ ఖాతాలపై గ్రీవెన్స్‌లో 1698 ఫిర్యాదులు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఫిర్యాదులు అందిన ఖాతాలు ఆన్లైన్లో వేధింపులకు పాల్పడడం, విద్వేష పూరిత కంటెంట్ స్ప్రెడ్ చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయడం వంటి పోస్టులు చేసినట్లు తేలినట్లు వెల్లడించింది. దీంతో ఆయా ఖాతాలు ట్విటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేని కారణంగా వాటిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.
ట్విటర్ మాత్రమే కాదు, గూగుల్ కూడా మే నెలలో ఇదే తరహా చర్యలు తీసుకుంది. వేధింపులు, తప్పుడు సమాఆచారం, విద్వేషం, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ వంటి నెగెటివ్ కంటెంట్ కలిగిన దాదాపు 3,93,303 కంటెంట్లను తొలగించింది. అంతేకాకుండా వాట్సాప్ కూడా 19 లక్షల ఖాతాలను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది.

ట్విటర్ ఇటీవల నోట్స్ పేరుతో సరికొత్త ఫీచర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
గతంలో Twitter యూజర్లు ఆ ప్లాట్‌ఫాంపై ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని పరిమితులు ఉండేవి. పోస్టుల్లో నిర్ణీత పదాల వరకే రాసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితి నుంచి ట్విటర్ ఉపశమనం కల్పించనుందని సమాచారం. దాదాపు 2500 పదాల వరకు రాసేందుకు అవకాశం కల్పించే దిశగా కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయోగాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌కు ట్విటర్ నోట్స్ (Twitter Notes) అనే పేరు పెట్టినట్లు మీడియా వర్గాలు లీకులిచ్చాయి. ఈ ఫీచర్ అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతుంది లేదా అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ ఫీచర్ ప్రత్యేకతలు:
ట్విటర్ ప్రవేశ పెట్టనున్న ఈ కొత్త Notes ఫీచర్ ద్వారా యూజర్లు 2500 పదాల వరకు తమ పోస్టుల్లో పొందు పరచవచ్చు. ఇదువరకు, Twitter యూజర్లు ఈ ప్లాట్‌ఫాం పై పోస్టు చేయాలంటే 280 పదాల పరిమితి ఉండేది. అంత కంటే ఎక్కువ పదాలతో ప్రకటన చేయాలనుకుంటే వారు టెక్స్ట్‌తో చిత్రాలను పోస్ట్ చేయాలి లేదా ఇతర ఎక్స్టర్నల్ లింక్‌లపై ఆధారపడాల్సి ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ఆ సమస్య తొలగనుంది. యూజర్ తాను ఏం చెప్పాలనుకున్నాడో పూర్తిగా, వివరంగా, స్పష్టంగా ఒకే పోస్ట్‌లో వెల్లడించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో ఎక్కువ పదాలతో విషయాల్ని పంచుకోవాలనుకునే యూజర్ల లక్ష్యం నెరవేరనుందని తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086