ఐఒయస్5లో ట్విట్టర్‌ని అనుసంధానం చేయడం వల్ల ప్రపంచం మీ గుప్పిట్లో

Posted By: Staff

ఐఒయస్5లో ట్విట్టర్‌ని అనుసంధానం చేయడం వల్ల ప్రపంచం మీ గుప్పిట్లో

కాలిఫోర్నియా: 700మంది మిలియన్ యూజర్స్‌ని కలగి ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ని ఆపిల్ కంపెనీ కొత్తగా రూపోందించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఐఒయస్5 తో పాటు అనుసంధానం చేసింది. దీని ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్ టచ్ యూజర్స్ డైరెక్టుగా డివైజ్ నుండే ఫోటోలు, మ్యాప్స్, వెబ్ సైట్స్ లాంటివాటిని ట్వీట్ చేసుకోవచ్చు. ఇలా ఆపిల్, ట్విట్టర్ రెండింటి కలయిక వల్ల ట్విట్టర్‌కి కూడా కొత్త ఎనర్జీ వస్తుందని అన్నారు. మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయినటువంటి ట్విట్టర్ ద్వారా ఫేస్ బుక్‌కి కూడా పాపులారిటీ వస్తుంది.

ఈ సందర్బంలో ఆపిల్ ఐఒయస్‌కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ ఫర్‌స్టాల్ మాట్లాడుతూ ఇలా చేయడం వల్ల జనాభా వారానికి బిలియన్ ట్వీట్స్‌ని స్నేహితులకు పంపవచ్చుఅని అన్నారు. శాన్ ఫ్రాన్సికోలో జరిగినటువంటి ఆపిల్ వరల్డ్ డెవలపర్స్ కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్ టచ్ కస్టమర్స్ చెప్పనిదాని ప్రకారం వారు ట్విట్టర్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. కస్టమర్స్‌కి ఈజీగా ఉండడం కోసం ట్విట్టర్‌ని ఆపిల్ ఐఒయస్ ప్రోడక్ట్స్ అన్నింటినిలో అనుసంధానం చేయడం జరుగుతుంది.

ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఐఒయస్ 5 ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్‌ని వాడుతున్నటువంటి కస్టమర్స్ ట్విట్టర్‌ని డైరెక్టుగా ఐఒయస్ అప్లికేషన్స్ ద్వారా ఫోటోలు, కెమెరా, యూట్యూబ్, మ్యాప్స్ మొదలగువాటిని సింగిల్ క్లిక్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఆపిల్ ఐఒయస్5 ఆపరేటింగి సిస్టమ్ ట్విట్టర్ ప్రోపైల్ పిక్చర్స్, ఐఒయస్ యూజర్స్ కాంటాక్ట్ లిస్ట్‌లను, ఈమోయిల్ అడ్రస్‌లను, ఫోన్ నెంబర్స్‌లను పుల్ చేసి ఉంచుతుంది. ఐఒయస్5లో ట్విట్టర్‌ని అనుసంధానం చేయడం వల్ల ప్రపంచం మొత్తాన్ని చాలా సులువుగా మీరు షేర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot